Abn logo
Jan 16 2021 @ 04:01AM

సలార్‌... పూజ చేశార్‌!

ప్రభాస్‌ హీరోగా నటించనున్న ‘సలార్‌’ చిత్రం శుక్రవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ‘‘నాకు అవకాశం ఇచ్చిన ప్రభాస్‌, హోంబలే ఫిల్మ్స్‌ అధినేత విజయ్‌ కిరగందూర్‌కి ధన్యవాదాలు. ఈ చిత్రం ప్రేక్షకులను నిరాశపరచదు. ఈ రోజు యశ్‌ మాతో ఉండటం ఆనందాన్నిచ్చింది’’ అని చిత్రదర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ అన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన కర్ణాటక డిప్యూటీ సీఎం అశ్వత్‌ నారాయణ్‌, తెలుగు నిర్మాతలు ‘దిల్‌’ రాజు, డీవీవీ దానయ్య, నవీన్‌ ఎర్నేని, సాయి కొర్రపాటి తదితరులు చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. ‘కె.జి.యఫ్‌’ చిత్రంతో విజయం అందుకున్న దర్శకుడు ప్రశాంత్‌, నిర్మాత విజయ్‌... ‘కె.జి.యఫ్‌ 2’ తర్వాత చేయనున్న చిత్రమిది.

Advertisement
Advertisement
Advertisement