Apr 22 2021 @ 18:14PM

రాధే ట్రైలర్‌: నగరంలో క్రైమ్‌ రేట్‌ పెరిగిపోయింది

సల్మాన్‌ఖాన్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘రాధే: యువర్‌ మోస్ట్‌ వాంటెడ్‌ భాయ్‌’ ట్రైలర్‌  వచ్చేసింది. మాదక ద్రవ్యాలు గురించి చెబుతున్న డైలాగ్‌లతో మొదలైన ట్రైలర్‌ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. నగరంలో క్రైమ్‌ రేట్‌ బాగా పెరిగిపోయింది అన్న డైలాగ్‌లు, దిశాపటానీతో సల్మాన్‌ మాట్లాడుతున్న సన్నివేశాలు  అభిమానులను అలరిస్తున్నాయి. ముఖ్యంగా అల్లు అర్జున్‌ నటించిన ‘దువ్వాడ జగన్నాథం’ చిత్రంలోని సీటీమార్‌ పాటను ఇందులో రీమేక్‌ చేయడం విశేషం. ఈ విషయాన్ని జానీ మాస్టర్‌ అధికారికంగా తెలిపారు. ఈ రీమేక్‌ గీతంలో దిశా పటానీ, సల్మాన్‌ వేసిన డాన్స్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గ్లామర్‌ బ్యూటీ, సల్మాన్‌ స్నేహితురాలు జాక్వలైన్‌ ఫెర్నాండెజ్‌ కూడా ఈ గీతంలో సందడి చేశారు. ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ చిత్రం రంజాన్‌ పండుగ సందర్భంగా మే 13న విడుదల కానుంది. థియేటర్‌లతోపాటు ఓటీటీ వేదికల్లో కూడా ఈ చిత్రం విడుదల కానుంది. 40 దేశాల్లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.