Chitrajyothy Logo
Advertisement
Published: Thu, 18 Aug 2022 13:41:35 IST

Salaar: 'రెబల్' స్టార్ ఫ్యాన్స్ కి సలార్ భయం...

twitter-iconwatsapp-iconfb-icon

రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ఫ్యాన్స్ కి దిల్ ఖుష్ చేసే అప్డేట్ ఇస్తూ... ప్రశాంత్ నీల్ (Prashanth Neel) ఇండిపెండెన్స్ డేకి సలార్ (Salaar) రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాడు. అందరూ ఈ పోస్టర్ ని చూసి, ఇన్నేళ్ళకి ప్రభాస్ కటౌట్ కి సరిపోయే సినిమా పడిందని మాట్లాడుకుంటున్నారు. అయితే కొంతమంది ఫ్యాన్స్ మాత్రం సలార్ కొత్త పోస్టర్ లో ఉన్న రిలీజ్ డేట్ చూసి భయపడుతున్నారు. పాన్ ఇండియా హీరో ఫాన్స్ భయపడడానికి కారణం, సలార్ అనౌన్స్ చేసిన అదే రోజున, దశాబ్దం క్రితం రెబల్ సినిమా రిలీజ్ అయ్యింది. 

లారెన్స్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ప్రమోషన్స్ లో ప్రభాస్ ని చూసి.. బిగ్గెస్ట్ హిట్ కొత్తబోతున్నామని ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు. తీరా రిలీజ్ డే రోజు చూస్తే, ఫస్ట్ డే ఫస్ట్ షోకి అభిమానులే జుట్టు పీక్కునే పరిస్థితి వచ్చింది. ఒకటి రెండు సీన్స్ అండ్ ఫైట్స్ మినహా రెబల్ సినిమాలో మాట్లాడుకోవడానికి ఏమీ లేదు. అందుకే ప్రభాస్ ఫ్యాన్స్ రెబల్ సినిమాని మర్చిపోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇప్పుడు అదే రిలీజ్ డేట్ కి సలార్ వస్తుంది అంటే వాళ్ళు కాస్త కంగారు పడుతున్నారు. రెండు సినిమాలు కమర్షియల్ జానర్ ప్రాజెక్ట్స్ ఏ అయినా రెబల్ మూవీకి దర్శకుడికి, ప్రశాంత్ నీల్ కి చాలా డిఫరెన్స్ ఉంది. 

ప్రశాంత్ నీల్ టేకింగ్ అండ్ ఎలివేషన్స్ కి ఇండియా వైడ్ ఫ్యాన్స్ ఉన్నారు. యష్ నే సాలిడ్ గా చూపించాడు అంటే, సాలిడ్ కటౌట్ ఉన్న ప్రభాస్ ని ఇంకెలా చూపిస్తాడో మనం అర్ధం చెసుకోవచ్చు. సో ఫ్యాన్స్ భయపడకుండా సలార్ సినిమాని, సెప్టెంబర్ 28నే చూసి... ఫ్లాప్ కొట్టిన అదే రోజున, పదేళ్ల తర్వాత ఇండియా వైడ్ రిసౌండ్ వచ్చే హిట్ కొట్టాము అని చెప్పడానికి రెడీ అవ్వండి.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement