Chitrajyothy Logo
Advertisement
Published: Wed, 25 May 2022 14:03:32 IST

Salaar: ప్రభాస్ ఫ్యాన్స్‌కు నిరాశే..!

twitter-iconwatsapp-iconfb-icon
Salaar: ప్రభాస్ ఫ్యాన్స్‌కు నిరాశే..!

గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ఫ్యాన్స్ అసలే పెద్ద డిసప్పాయింట్‌మెంట్‌లో ఉన్నారు. బాహుబలి (Bahubali) సిరీస్ తర్వాత అత్యంత భారీ అంచనాల మధ్య విడుదలైన సాహో (Sahoo), రాధే శ్యామ్ (Radhe Shyam) డిజాస్టర్‌గా నిలిచాయి. దాంతో అభిమానులందరూ తీవ్ర నిరాశలో ఉండి సలార్ (Salaar) అప్‌డేట్స్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. శృతి హాసన్ (Shruti Haasan) హీరోయిన్‌గా నటిస్తోంది. ఎప్పుడో చిత్రీకరణ మొదలైనాకూడా 40 శాతం టాకీపార్ట్ మాత్రమే పూర్తైందట. ఈ ఏడాదే రిలీజ్ అవుతుందనుకున్న సలార్ పలుకారణాల వల్ల షూటింగ్ ఇంకా చాలా చేయాల్సి ఉంది. 

అయితే, ఇప్పటికే 'సలార్' నుంచి వచ్చిన ప్రభాస్ ఫస్ట్ లుక్ అభిమానులతో పాటు కామన్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఇందులో డార్లింగ్ ఊర మాస్ గెటప్‌లో కనిపించి అందరినీ సర్ప్రైజ్ చేసాడు. ఇక మధ్యలో లొకేషన్ నుంచి లీకవుతున్న పిక్స్ కూడా అంచనాలు భారీగా పెంచుతున్నాయి.  అయితే, ఈ మూవీ నుంచి అధికారికంగా ఎలాంటి అప్‌డేట్స్ రాలేదు. చాలారోజుల నుంచి సలార్ మూవీ టీజర్ కోసం అందరూ ఎంతో ఆతృతగా ఎదుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మే నెలలో టీజర్ వదలబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ప్రభాస్ కూడా ఇదే విషయం చెప్పారు. 

అయితే, ఇప్పుడు మేకర్స్ ప్లాన్ మార్చుకున్నారని సమాచారం. 'సలార్' టీజర్‌ను ఈ నెలలో విడుదల చేయడం లేదని.. త్వరలోనే దీనికి సంబంధించిన  తేదీని వెల్లడించనున్నట్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీన్నిబట్టి జూన్ లేదా జూలైలో టీజర్‌ను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. దీంతో మూవీ టీజర్ వస్తుందనుకున్న అభిమానులకు నిరాశే మిగిలిందంటున్నారు. ఎందుకనో ప్రభాస్ సినిమా నుంచి అనుకున్న సమయానికి అప్‌డేట్స్ రావడం లేదు. రాధే శ్యామ్ సినిమా సమయంలో ఇదే జరిగింది. ఇప్పుడు సలార్ విషయంలో అదే రిపీట్ అవుతోంది. మరి చిత్రబృందం ఎప్పుడు టీజర్ రిలీజ్ అప్‌డేట్ ఇస్తుందో చూడాలి. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement