కొన్ని క్రేజీ కాంబినేషన్స్ గురించి అభిమానులే కాదు, ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అలాంటి కలయికే రెబెల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్. వీరిద్దరి కాంబోలో సినిమా రావాలని చాలా మంది ఎదురుచూశారు. అందరి కోరుకున్నట్లే వీరి కాంబినేషన్లో `సలార్` సినిమా రూపొందనుంది. శుక్రవారం ఉదయం పదకొండు గంటలకు 'సలార్' సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. కేజీయఫ్ వంటి భారీ బడ్జెట్ మూవీని నిర్మిస్తోన్న హోంబలే ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ``నాకు అవకాశం ఇచ్చిన హోంబలే ఫిలింస్ అధినేత విజయ్ కిరగందూర్గారికి, ప్రభాస్గారికి ధన్యవాదాలు. అలాగే నా ప్రియమైన రాకింగ్ స్టార్ యష్ ఈరోజు మాతో పాటు కలవడం మరింత ఆనందాన్ని ఇచ్చింది. మీ ప్రేమ, ఆశీర్వాదాలు అందిస్తున్న అందరికీ థాంక్స్. సలార్ మిమ్మల్ని నిరాశపరచదు`` అంటూ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ట్వీట్ చేయగా, అందరూ థాంక్స్ చెబుతూ నిర్మాత విజయ్ కిరగందూర్ ట్వీట్ చేశారు.