Jul 21 2021 @ 13:55PM

‘సలార్’ కోసం ప్రభాస్ యాక్షన్

ప్రస్తుతం తన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్‌‘ను పూర్తి చేయ‌డంలో బిజీగా ఉన్న అగ్ర క‌థానాయ‌కుడు ప్ర‌భాస్ భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతోన్న ‘స‌లార్‌, ఆదిపురుష్’ చిత్రాల‌ను సెట్స్‌పైకి తీసుకెళ్లిన సంగ‌తి తెలిసిందే. ‘రాధేశ్యామ్’ పూర్తి కాగానే ‘స‌లార్‌’పై ప్ర‌భాస్ ఫుల్ ఫోక‌స్ పెట్ట‌బోతున్నాడు. ఇప్ప‌టికే రామోజీ ఫిలింసిటీలో ‘స‌లార్’ షెడ్యూల్‌కు సంబంధించిన భారీ సెట్స్ వేశారు. ఛేజింగ్, ఫైట్స్‌తో ఈ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌లో యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించనున్నారు. అలాగే సినిమాకు కీల‌క‌మైన ట్విస్టును కూడా ఈ షెడ్యూల్‌లోనే చిత్రీక‌రిస్తార‌ని స‌మాచారం. శ్రుతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ సినిమాను హోంబ‌లే ఫిలింస్ బ్యాన‌ర్‌పై ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కిస్తున్నాడు.