అట్రాసిటీ కేసు నమోదుచేయాలి

ABN , First Publish Date - 2021-04-19T06:00:44+05:30 IST

బీఆర్‌ అంబే డ్కర్‌ ఫొటోను వ్యంగ్యంగా చిత్రించిన సాక్షి యాజ మాన్యం బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాం డుచేస్తూ ఆదివారం అమలాపురం గడియార స్తంభం సెంటర్‌లో బీఎస్పీ ఆధ్వర్యలో నిరసన తెలిపారు.

అట్రాసిటీ కేసు నమోదుచేయాలి

సాక్షి దినపత్రిక ప్రతుల దహనం

అమలాపురం టౌన్‌, ఏప్రిల్‌ 18: బీఆర్‌ అంబే డ్కర్‌ ఫొటోను వ్యంగ్యంగా చిత్రించిన సాక్షి యాజ మాన్యం బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాం డుచేస్తూ ఆదివారం అమలాపురం గడియార  స్తంభం సెంటర్‌లో బీఎస్పీ ఆధ్వర్యలో నిరసన తెలిపారు. బాధ్యులపై అట్రాసిటీ కేసు నమోదుచేసి అరెస్టు చేయాలని లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సాక్షి దినపత్రిక ప్రతులను దహనం చేశారు. బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు కాండ్రేగుల నరసింహం, నియోజ కవర్గ అధ్యక్షుడు వడ్డి వీరాస్వామి, కుసుమ వెంకటే శ్వరరావు, గుత్తాల రమణ, సాకా రాజారావు, నాయ కులు పెయ్యల ప్రతాప్‌కుమార్‌, కొట్నాల శ్రీను, బడుగు భీమేష్‌, బొంతు మురళీకృష్ణ, తానింకి చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2021-04-19T06:00:44+05:30 IST