మహిళకు అండగా నిలిచిన సఖి సిబ్బంది

ABN , First Publish Date - 2022-05-25T03:47:18+05:30 IST

అనారోగ్యంతో బాధపడుతున్న మహిళకు సఖి కేంద్రం సిబ్బం ది అండగా నిలిచారు. మంచిర్యాల రైల్వేస్టేషన్‌లో దిక్కు తోచని స్థితిలో మహిళ ఏడుస్తూ కూర్చుంది. ఆమెను చూసిన రైల్వే పోలీసులు సఖి కేంద్రానికి సమా చారం అందించారు. దీంతో సఖి కేంద్రం సిబ్బంది రైల్వేస్టేషన్‌కు వెళ్లి మహిళ వివరాలను అడిగి తెలుసుకున్నారు. కొత్తగూడెం సమీపంలోని రామవరం గ్రామ మని, పేరు సింధు అని తెలిపింది. ఏడాదిన్నర కిందట రాజేష్‌ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకున్నానని, తనకు ఆరోగ్యం బాలేదని కొత్తగూడెంలోని ఆసు పత్రికి వెళితే రక్తం తక్కువగా ఉందని రక్తం ఎక్కించారని తెలిపింది.

మహిళకు అండగా నిలిచిన సఖి సిబ్బంది
రైల్వేస్టేషన్‌లో ఉన్న సింధుని ఆసుపత్రికి తరలిస్తున్న సిబ్బంది

ఏసీసీ, మే 24: అనారోగ్యంతో బాధపడుతున్న మహిళకు సఖి కేంద్రం సిబ్బం ది అండగా నిలిచారు.  మంచిర్యాల రైల్వేస్టేషన్‌లో దిక్కు తోచని స్థితిలో మహిళ ఏడుస్తూ కూర్చుంది. ఆమెను చూసిన రైల్వే పోలీసులు సఖి కేంద్రానికి సమా చారం అందించారు. దీంతో సఖి కేంద్రం సిబ్బంది రైల్వేస్టేషన్‌కు వెళ్లి మహిళ వివరాలను అడిగి తెలుసుకున్నారు. కొత్తగూడెం సమీపంలోని రామవరం గ్రామ మని, పేరు సింధు అని తెలిపింది. ఏడాదిన్నర కిందట రాజేష్‌ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకున్నానని, తనకు ఆరోగ్యం బాలేదని కొత్తగూడెంలోని ఆసు పత్రికి వెళితే రక్తం తక్కువగా ఉందని రక్తం ఎక్కించారని తెలిపింది. రక్తం ఇన్ఫెక్షన్‌ అవడంతో రెండు కాళ్లు, ఎడమ చేయి పనిచేయడం లేదని నెల రోజులు ఆసుపత్రిలో ఉన్నట్లు పేర్కొంది. ఆరోగ్యం బాగా లేకపోవడంతో భర్త వదిలేసి వెళ్లిపోయాడని, తల్లిదండ్రులు లేనందున తమ్ముడి సహాయంతో మంచిర్యాలలో ఉంటున్న చెల్లెలు ఇంటికి వచ్చినట్లు తెలిపింది. చెల్లెలు ఆదరించకపోవడంతో తమ్ముడు మంచిర్యాల రైల్వేస్టేషన్‌లో వదిలేసి వెళ్లిపోయాడని వివరించింది. ఏం చేయాలో తెలియని పరిస్థితిల్లో ఇక్కడే కూర్చున్నట్లు తెలిపింది. పరిస్థితి తెలుసు కున్న సఖి కేంద్రం సిబ్బంది మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. సఖి కేంద్రం నిర్వాహకురాలు శ్రీలత, లీగల్‌ అడ్వయిజర్‌ శైలజ, కౌన్సిలర్‌ విజయ, సిబ్బంది వసంత, శ్రీకాంత్‌, రైల్వే పోలీసు మహేష్‌ను అభినందించారు.  

Updated Date - 2022-05-25T03:47:18+05:30 IST