Abn logo
Sep 23 2021 @ 00:47AM

సఖి కేంద్రం పనుల్లో వేగం పెంచాలి

భవనం మ్యాప్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

సిరిసిల్ల, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): సిరిసిల్లలో రూ.48 లక్షల వ్యయంతో చేపట్టిన సఖి కేంద్రం భవన నిర్మాణాన్ని వేగ వంతం చేయాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి ఆదేశించారు.  బుధవారం సిరిసిల్ల బైపాస్‌ రోడ్డులోని సఖి కేంద్రం భవన నిర్మా ణాన్ని పరిశీలించారు. ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని, ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని అన్నారు. అనంతరం భవనం పెయింటింగ్‌, విద్యుత్‌ కనెక్షన్‌ పనులు మాత్రమే మిగిలాయని అధికారులు వివరిం చారు. జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీనారాయణ, జిల్లా పంచాయ తీరాజ్‌ ఈఈ శ్రీనివాసరావు, సర్వేయర్‌ ఏడీ శ్రీనివాస్‌, తహ సీల్దార్‌ విజయ్‌కుమార్‌ ఉన్నారు.