సఖి సెంటర్‌ను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి
సిరిసిల్ల కలెక్టరేట్, జనవరి 27: సఖి కేంద్రం నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. సిరిసిల్ల పట్టణ శివారులోని మొదటి బైపాస్‌రోడ్డులో నూతనంగా నిర్మించిన సఖి సెంటర్ భవనంతోపాటు ప్రహరీ, ఇతరత్రా నిర్మాణ పనులను గురువారం పరిశీలించారు. పనుల్లో వేగం పెంచడంతో పాటు నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కాంట్రాక్టర్‌కు సూచిం చారు. పనులను నిత్యం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశిం చారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.