Abn logo
Nov 21 2020 @ 23:06PM

‘సఖి’ సేవలపై అవగాహన

కౌటాల, నవంబరు 21: కౌటాల మండలంలోని కన్నెపల్లి, గుడురుపేట, శిర్సా, కనికి గ్రామాల్లో శనివారం సఖీ కేంద్రం ఆధ్వర్యంలో సఖీ సేవలను గ్రామస్తులకు వివరించారు. సఖీ సెంటర్‌ లీగల్‌ అడ్వైజర్‌ రమేష్‌, కేస్‌ వర్కర్‌ మౌనిక, పారామెడికల్‌ స్వాతిలు సఖీ కేంద్రం హెల్స్‌లైన్‌ నెం.181పై అవగాహన కల్పించారు. సఖీ కేంద్రం ద్వారా కౌన్సిలింగ్‌ సేవలు, వైద్య సేవలు, పోలీసు సహయం అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ గణపతి, కనకక్క, శారద, కార్యదర్శులు కిరణ్‌, రవికుమార్‌, జ్యోతి, సిబ్బంది ప్రవీణ్‌, మున్నా తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement