Amaravathi : పొట్టకూటి కోసం కూలి పనులకు వెళ్తూ విద్యుత్ తీగలు తెగి పడి ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్(Sake Sailajanath) పేర్కొన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. చనిపోయిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని సాకే శైలజానాథ్ సూచించారు.