RTC MD సజ్జనార్ కీలక నిర్ణయం..

ABN , First Publish Date - 2021-10-19T14:07:29+05:30 IST

ప్రయాణికులను ఆకట్టుకునేందుకు ఆర్టీసీ అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తోంది....

RTC MD సజ్జనార్ కీలక నిర్ణయం..

  • Sajjanar ఆకస్మిక తనిఖీలు.. బస్టాండ్లలో ధరలపై నజర్‌..
  • ఎంజీబీఎస్‌, జేబీఎస్‌లలో అధికారుల తనిఖీలు


హైదరాబాద్‌ సిటీ : ప్రయాణికులను ఆకట్టుకునేందుకు ఆర్టీసీ అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తోంది. బస్టాండ్లలోని దుకాణాల్లోని ధరలపై కూడా దృష్టి సారించింది. ఎంజీబీఎస్‌లో 90కి పైగా స్టాల్స్‌  ఉండగా, ప్రస్తుతం 65 మాత్రమే నడుస్తున్నాయి. పండగ నేపథ్యంలో రద్దీ పెరగడంతో కొంతమంది ఎంఆర్‌పీ కంటే అధిక ధరలకు వస్తువులు విక్రయించారు. ఫిర్యాదులు అందడంతో ప్రయాణికుల్లా వస్తువులు కొనుగోలు చేశారు. అధిక ధరలు విక్రయించిన ఒక్కో స్టాల్‌కు రూ.1,000 జరిమానాతో నోటీసులు జారీ చేశారు. తినుబండారాలు, బ్యాగులు, వాటర్‌బాటిల్స్‌, కూల్‌డ్రింక్స్‌, ఆట వస్తువులు ఇలా ఏవైనా సరే ఎంఆర్‌పీకే విక్రయించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ఆకస్మిక తనిఖీలతో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ప్రయాణికుల నుంచి ఫీడ్‌ బ్యాక్‌ తీసుకునేందుకు బస్టాండ్లలో ప్రత్యేక ఫిర్యాదు బాక్సులు ఏర్పాటు చేశారు. సంబంధిత అధికారుల ఫోన్‌ నంబర్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.



Updated Date - 2021-10-19T14:07:29+05:30 IST