అమరావతి: చర్చల వల్లే సమస్య పరిష్కారం అవుతుందని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. పీఆర్సీపై ఈరోజు కూడా ఉద్యోగులతో చర్చలకు వచ్చామని ఆయన తెలిపారు. ఇవాళ కొన్ని సంఘాలు చర్చలకు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. ఘర్షణకు దారి తీయకూడదనే కమిటీ ఏర్పాటు చేశామన్నారు. స్టీరింగ్ కమిటీ సభ్యులు రాలేదన్నారు. వేరే సంఘం నాయకులు వచ్చి మాట్లాడారని ఆయన తెలిపారు. చర్చల వల్లే సమస్య పరిష్కారం అవుతుందని, లేకపోతే లేని పోనీ అపోహలు వస్తాయని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే మూడు రోజులు ఆలస్యం అయిందన్నారు.
ఇవి కూడా చదవండి