చంద్రబాబు ఎజెండానే.. బీజేపీ ఎజెండా: సజ్జల

ABN , First Publish Date - 2021-12-29T21:00:15+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు ఎజెండానే.. బీజేపీ ఎజెండా అని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు.

చంద్రబాబు ఎజెండానే.. బీజేపీ ఎజెండా: సజ్జల

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు ఎజెండానే.. బీజేపీ ఎజెండా అని ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. బుధవారం సజ్జల మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ అనుబంధ విభాగంలా బీజేపీ పనిచేస్తోందని మండిపడ్డారు. ప్రాంతీయ పార్టీకి అనుగుణంగా జాతీయ పార్టీ పనిచేస్తోందన్నారు.ప్రజాగ్రహ దీక్షలో టీడీపీ స్క్రిప్ట్‌ను సోమువీర్రాజు చదివారని చెప్పారు. విభజన సమస్యలపై బీజేపీ ఏం చేస్తోంది? అని ప్రశ్నించారు వైసీపీని ఎదుర్కొనేందుకు ఎందుకు సొంత ఎజెండా పెట్టుకోలేకపోతున్నారు? అని నిలదీశారు. టీడీపీ, బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయని సజ్జల రామకృష్ణారెడ్డి  వ్యాఖ్యానించారు. 

Updated Date - 2021-12-29T21:00:15+05:30 IST