అమరావతి: మహానాడును చూసి టీడీపీ (TDP) తెగ సంతోషపడుతోందని ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) విమర్శించారు. ఎన్నికల్లో విజయం సాధించినట్లు పొంగిపోతున్నారని ఎద్దేవాచేశారు. మహానాడులో టీడీపీనేతలంతా అబద్ధాలే చెప్పారని మండిపడ్డారు. ప్రభుత్వంపై బురద జల్లేందుకే మహానాడు నిర్వహించినట్టుందన్నారు. బీసీ మంత్రుల బస్సుయాత్రను చూసి ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. సీఎం జగన్ దావోస్ పర్యటనపై విషప్రచారం చేశారు చేస్తున్నారని, తమపై విమర్శలు చేయడమే టీడీపీ పనిగా పెట్టుకుందని సజ్జల రామకృష్ణారెడ్డి దుయ్యబట్టారు.
ఇవి కూడా చదవండి