AP: పొత్తులపై Sajjala రామకృష్ణారెడ్డి ఏమన్నారంటే...

ABN , First Publish Date - 2022-05-09T21:27:45+05:30 IST

ఏపీలో పొత్తులపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పొత్తులపై స్పందించారు.

AP: పొత్తులపై Sajjala రామకృష్ణారెడ్డి ఏమన్నారంటే...

Amaravathi: ఎన్నికలకు రెండేళ్ల ముందే ఏపీలో పొత్తులపై చర్చ మొదలైంది. ఈ అంశంపై ప్రతిపక్షాలు స్వరం పెంచుతుండటంతో అధికార వైసీపీలో గుబులు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పొత్తులపై ప్రభుత్వ సలహాదారు Sajjala రామకృష్ణారెడ్డి పొత్తులపై స్పందించారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ భావసారూప్యత కలిగిన పార్టీల మధ్య పొత్తులుంటాయన్నారు. TDP అధినేత చంద్రబాబు ఎన్ని జంప్‌లు చేశారో అందరికీ తెలుసునని అన్నారు.


జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు వ్యూహం అంటూ లేదని సజ్జల విమర్శించారు. చంద్రబాబు, పవన్‌కు మధ్య కచ్చితంగా అవగాహన ఉందన్నారు. చంద్రబాబు సీఎం పదవి త్యాగం చేసి పవన్‌కు ఇస్తారా? అని ప్రశ్నించారు. పవన్ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడంలేదన్నారు. బీజేపీతో పొత్తు ఉంటూనే.. పొత్తులపై ఇంకా నిర్ణయం తీసుకోలెదంటారని.. పవన్‌కు స్ర్కీన్‌ ప్లే, డైరెక్షన్ అన్నీ చంద్రబాబేనని ఆరోపించారు. ఒంటరిగా పోటీ చేసి గెలిచే ధైర్యం చంద్రబాబుకు లేదన్నారు. ప్రజా ప్రభుత్వాన్ని కూలదోయడానికి కుట్రలు చేస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు.

Read more