Abn logo
Jun 6 2020 @ 15:24PM

రాజు పాత్ర‌లో సాయితేజ్‌..!

సుప్రీమ్ హీరో సాయితేజ్ హీరోగా న‌టిస్తోన్న ‘సోలో బ్రతుకే సో బెట‌ర్’ సినిమా విడుద‌లకు సిద్ద‌మ‌వుతోంది. కాగా దేవాక‌ట్ట ద‌ర్శ‌క‌త్వంలో సినిమాను లాంఛ‌నంగా ప్రారంభించారు. దేవాకట్ట సినిమాతో పాటు వీరుపోట్ల ద‌ర్శక‌త్వంలో ఓ పీరియాడిక్ మూవీలో సాయితేజ్ న‌టించాల్సి ఉంది. క‌రోనా ప్ర‌భావం లేకుండా ఉండుంటే సినిమా ఈ పాటికి సినిమాల‌న్నీ స్టార్ట్ కావాల్సింది. ఇప్పుడు అన్నీ వాయిదా ప‌డ్డాయి. లేటెస్ట్ న్యూస్ ప్రకారం వీరుపోట్ల డైరెక్ట్ చేయ‌బోయే పీరియాడిక‌ల్ మూవీ కృష్ణ‌దేవ‌రాయ‌ల కాలానికి చెందిన ఓ రాజుకు సంబంధించిన‌ద‌ని, రాజు పాత్ర‌లో సాయితేజ్ క‌నిపించ‌బోతున్నాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. మ‌రి ఇందులో నిజా నిజాలు తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. 

Advertisement
Advertisement
Advertisement