‘పబ్లిక్‌ సర్వెంట్‌’ కిందకు రాను: సాయిరెడ్డి

ABN , First Publish Date - 2020-12-03T09:03:03+05:30 IST

‘పబ్లిక్‌ సర్వెంట్‌’ కిందకు రాను: సాయిరెడ్డి

‘పబ్లిక్‌ సర్వెంట్‌’ కిందకు రాను: సాయిరెడ్డి

జగన్‌ అక్రమాస్తుల కేసులో ఏ2గా ఉన్న విజయసాయిరెడ్డి దాఖలు చేసిన డిశ్చార్జి పిటిషన్‌పై బుధవారం వాదనలు కొనసాగాయి. పిటిషనర్‌ తరఫు న్యాయవాది ఉమామహేశ్వరరావు వాదనలు వినిపించారు. అవినీతి నిరోధక చట్టం ప్రకారం పిటిషనర్‌ పబ్లిక్‌ సర్వెంట్‌ నిర్వచనం కిందకు రారని తెలిపారు. పబ్లిక్‌ సర్వెంట్‌గా పరిగణించినప్పటికీ పిటిషనర్‌ బ్యాంకు నియమావళిని ఉల్లంఘించలేదన్నారు. ఈ నియమాలు ఉల్లంఘించినా క్రిమినల్‌ కేసులు నమోదు చేయడానికి వీల్లేదన్నారు. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పులను ఉటంకించారు. జగన్‌ అక్రమాస్తుల కేసుల్లో జగతి పబ్లికేషన్‌పై ఉన్న కేసులు, రాంకీ, వాన్‌పిక్‌ కేసులు డిసెంబరు 4కి, పెన్నా సిమెంట్స్‌, రఘురాం సిమెంట్స్‌పై కేసులు ఈ నెల 7కి వాయిదా వేశారు. ఈడీ కేసుల విచారణ గురువారానికి వాయిదా పడింది.

Updated Date - 2020-12-03T09:03:03+05:30 IST