Abn logo
Jan 16 2021 @ 09:18AM

పవన్ సినిమా.. సాయిపల్లవి ఏం చేస్తుంది?

నటనకు ఆస్కారం ఉన్న పాత్రైతే ముందుగా అందరికీ సాయిపల్లవి పేరే గుర్తుకు వస్తోంది. దీంతో ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస అవకాశాలతో బిజీగా ఉన్న హీరోయిన్‌గా సాయిపల్లవి దూసుకుపోతోంది. డైరెక్టర్ శేఖర్ కమ్ముల `లవ్ స్టోరీ` సినిమాలో నాగచైతన్యతో కలిసి నటించింది. అలాగే రానా `విరాటపర్వం`, నానితో `శ్యామ్ సింగరాయ్` సినిమాలు చేస్తోంది. 


త్వరలో ప్రారంభం కాబోతున్న పవన్ కల్యాణ్-రానా `అయ్యప్పనుమ్ కోషియమ్` రీమేక్‌లో కూడా సాయిపల్లవి కీలక పాత్రకు ఎంపికైనట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో పవన్ భార్య పాత్రకు సాయిపల్లవిని ఎంపిక చేసినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఆ సినిమాకు డేట్లు కేటాయించడం సాయిపల్లవికి సమస్యగా మారిందట. వరుస సినిమాలతో బిజీగా ఉండడంతో `అయ్యప్పనుమ్ కోషియమ్` రీమేక్‌కు డేట్లు అడ్జెస్ట్ కావడం లేదట. మరి, సాయిపల్లవి ఏం చేస్తుందో చూడాలి. 

Advertisement
Advertisement
Advertisement