అమరావతి: జగన్‌రెడ్డి.. ఏరియల్ సర్వేలతో కాలయాపన వద్దని ఏపీసీసీ చీఫ్ శైలజానాథ్ సూచించారు. విపత్తుల సమయంలో ప్రజాక్షేత్రంలో ఉండి సమస్యలను పరిష్కరించాలన్నారు. సహాయక చర్యల్లో కాంగ్రెస్ కార్యకర్తలంతా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. జగన్ రైతులపై కనికరం లేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. జగన్‌రెడ్డి కేవలం అధికార దాహానికి పనిచేస్తున్నట్లు ఉందన్నారు.