సాయికుమార్ హీరోగా కొత్త చిత్రం 'నాతో నేను' ప్రారంభం

సీనియర్ నటుడు సాయికుమార్ హీరోగా కొత్త చిత్రం ప్రారంభమయింది. ఎల్లాలు బాబు టంగుటూరి సమర్పణలో శ్రీ భవ్ నీష్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్న ఇందులో సాయి శ్రీనివాస్, ఐశ్వర్య, విజయ్ చందర్,రాజీవ్ కనకాల నటీనటులు. "నాతో నేను" అనే టైటిల్‌తో శాంతి కుమార్ తుర్లపాటి రూపొందిస్తున్న ఈ సినిమాను ప్రశాంత్ టంగుటూరి నిర్మిస్తుండగా, విజయదశమి సందర్భంగా.. పూజా కార్యక్రమాలు హైదరాబాదులో ఘనంగా ప్రారంభమయింది. ఈ కార్యక్రమానికి సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్,సీనియర్ నటుడు విజయ చందర్, ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి, హీరో ఆది సాయి కుమార్ తదితర సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. 

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు శాంతికుమార్ తుర్లపాటి మాట్లాడుతూ..మిమిక్రీ ఆర్టిస్ట్ అయిన నేను చిన్న కళాకారుడు స్థాయినుంచి ఈరోజు డైరెక్టర్ స్థాయికి వచ్చాను అంటే దానికి కారణం నా గాడ్ ఫాదర్ మల్లెమాల శ్యాం ప్రసాద్ రెడ్డి గారు. మంచి క్రూతో విజయదశమి రోజు మొదలు పెట్టిన మా సినిమా మంచి విజయం సాధించాలని, దర్శకుడిగా ఇలాగే మంచి అవకాశాలు రావాలని  దేవున్ని , పెద్దలను మనస్ఫూర్తిగా  కోరుచున్నాను అన్నారు. నిర్మాత ప్రశాంత్ టంగుటూరి మాట్లాడుతూ.. .ఎల్లాలు బాబు టంగుటూరి సమర్పణలో "నాతో నేను" సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మంచి కథతో తీస్తున్న మా చిత్రానికి  మురళి మోహన్ గారు డిఓపిగా, సత్య కశ్యప్ మ్యూజిక్ ఇలా అందరూ అద్భుతమైన సాంకేతిక నిపుణులతో మంచి నటీనటులతో వస్తున్న ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకాదరణ పొందుతుందని ఆశిస్తున్నాను అన్నారు. 

 


Advertisement