రిమోట్ కంట్రోల్‌ ఒంటెల రేసులు.. అబ్బురపరిచే Viral కథనం!

ABN , First Publish Date - 2022-03-16T22:49:53+05:30 IST

మనకు కార్లు, గుర్రాల రేసుల గురించి తెలుసు. మధ్యప్రాచ్య దేశాల వారు ఒంటెలతో కూడా రేసులు నిర్వహిస్తుంటారు. రిమోట్ కంట్రోల్‌తో కార్లను నడిపించే ఈవెంట్లు కూడా అనేక దేశాల్లో జరుగుతున్నాయి. మరి రిమోట్ కంట్రోల్‌తో నడిచే ఒంటెలతో రేసులు నిర్వహించడం గురించి ఎప్పుడైన విన్నారా..

రిమోట్ కంట్రోల్‌ ఒంటెల రేసులు.. అబ్బురపరిచే Viral కథనం!

ఇంటర్నెట్ డెస్క్: మనకు కార్లు, గుర్రాల రేసుల గురించి తెలుసు. మధ్యప్రాచ్య దేశాల వారు ఒంటెలతో కూడా రేసులు నిర్వహిస్తుంటారు. రిమోట్ కంట్రోల్‌తో కార్లను నడిపించే ఈవెంట్లు కూడా అనేక దేశాల్లో జరుగుతున్నాయి. మరి రిమోట్ కంట్రోల్‌తో నడిచే ఒంటెలతో రేసులు నిర్వహించడం గురించి ఎప్పుడైన విన్నారా.. అసలు బతికున్న జంతువులను రిమోట్ కంట్రోల్‌తో నియంత్రించవచ్చనే ఆలోచన మీకు ఎప్పుడైనా కలిగిందా..? వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదూ..! ఎడారి దేశం ఒమన్‌లో  జరిగే సయిఫ్ అల్ ఇత్తిహాద్ పండుగ ఈ ఒంటెల రేసులకు వేదిక అయింది. నాలుగు రోజుల పాటు సాగా ఈ మహాసంరంభం మార్చి 13న ఈ ప్రారంభమైంది. 


ఒమన్ సాంస్కృతిక వారసత్వ సంపదను గుర్తుకు తెచ్చేలా ఏటా జరిగే ఈ వేడుకల్లో ఈ సారి రిమోట్ కంట్రోల్ ఒంటెల రేసులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ రిమోట్ కంట్రోల్ పందేలతో పాటూ వివిధ కేటగిరీల ఒంటెల రేసుల్లో మొత్తం 1600పైగా ఒంటెలు పాలు పంచుకున్నాయి. ఇక రిమోట్ కంట్రోల్ రేసుల్లో జాకీలు ఒంటెలపై స్వారీ చేయరు. ఇందుకు బదులుగా ఒంటెలకు రిమోట్‌తో నియంత్రిచగిలిగే కొరడాలను ఒంటెలపై ఏర్పాటు చేస్తారు. దూరం నుంచి జాకీలు ఈ రోబోట్ కొరడాలను ఝళిపిస్తూ ఒంటెల దిశ, వేగాలను నియంత్రిస్తారు. కొన్ని సందర్భాల్లో ఒంటెలు ఏకంగా గంటకు 65 కిలోమీటర్ల వేగాన్ని అందుకున్నాయంటే ఈ పరుగు పందేలు ఏ స్థాయిలో నిర్వహిస్తున్నారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.


కాగా.. ఒమన్‌లో కొన్ని శతాబ్దాలుగా ఒంటెలతో ఆటల పోటీలు నిర్వహిస్తున్నారు. కాలంతో పాటూ ఈ ఆటల్లో అనేక మార్పులు వచ్చాయి. ప్రస్తుతం ఈ క్రీడలు అక్కడ ప్రొఫెషనల్ స్థాయికి చేరుకున్నాయి. ఈ క్రీడల్లో పాల్గొనే ఒంటెలకు ప్రత్యేకంగా ట్రెయినింగ్ ఇస్తారు. అంతేకాదు.. వీటి కోసం రేసు ట్రాకులు వినియోగించడంతో పాటూ క్రీడల నిర్వహణలో ఎన్నో ఆధునిక టెక్నాలజీల సాయం తీసుకుంటారు నిర్వాహకులు. ఇక విజేతలకు ఖరీదైన కార్లు, నగదును బహుమతిగా ఇస్తారు. ఎప్పుడో 7వ శతాబ్దంలో మొదలైన ఈ రేసులకు ఇన్ని శతాబ్దాల తరువాత కూడా ఎడారి దేశాల్లో అసలేమాత్రం పాపులారిటీ తగ్గట్లేదు.

Updated Date - 2022-03-16T22:49:53+05:30 IST