Chitrajyothy Logo
Advertisement
Published: Sun, 08 May 2022 11:24:16 IST

Sampath Nandi : మెగా హీరోతో నెక్స్ట్ మూవీ?

twitter-iconwatsapp-iconfb-icon

‘ఏమైంది ఈ వేళ’ చిత్రంతో టాలీవుడ్ లో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు సంపత్ నంది (Sampath Nandi). తొలి ప్రయత్నంతోనే సక్సెస్ అయిన ఇతడు తదుపరిగా రామ్ చరణ్ (Ramcharan) తో ‘రచ్చ’ తెరకెక్కించి తొలి కమర్షియల్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత రవితేజ (Raviteja) తో ‘బెంగాల్ టైగర్’ తీశాడు. సినిమా పర్వాలేదనిపించుకుంది. ఆపై గోపిచంద్ (Gopichand) తో తీసిన ‘గౌతమ్ నంద’ ఆశించిన రీతిలో అలరించలేకపోయింది. ఆ తర్వాత అతడితోనే తీసిన ‘సీటీమార్’ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కబడ్డి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. త్వరలోనే ‘విక్రమార్కుడు’ సీక్వెల్ ను హ్యాండిల్ చేయబోతున్నాడు సంపత్ నంది (Sampath Nandi). ఇంతలోనే ఈ దర్శకుడికి మరో మెగా హీరోని డైరెక్ట్ చేసే అవకాశమొచ్చినట్టు టాక్స్ వినిపిస్తున్నాయి. ఆ మెగాహీరో మరెవరో కాదు.. సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్. సంపత్ లో మంచి టాలెంట్ ఉన్నప్పటికీ..  ఇప్పటి వరకూ అతడి కథలకు సరైన హీరోలు దొరక్క అతడి ప్రాజెక్ట్స్ లేటవుతున్నాయి. ఎట్టకేలకు ఇప్పుడు అతడి రాసుకున్న ఓ సూపర్ సబ్జెక్ట్ కు సాయిధరమ్ తేజ్ (Saidharam tej) గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

ఈ మధ్య ముగ్గురు హీరోలకు సంపత్ నంది (Sampath Nandi) కథలు చెప్పగా.. అందులో ఒకదానికి హీరోగా సాయిధరమ్ తేజ్ సెట్ అవడం విశేషం. ఇటీవల తేజను కలిసిన సంపత్ అతడికి ఒక కథ చెప్పడం.. అది తేజుకు బాగా నచ్చడం జరిగిపోయాయి. అయితే సంపత్ చేతిలో ప్రస్తుతం ‘విక్రమార్కుడు 2’ కూడా ఉండడంతో.. దాంతో పాటే సమాంతరంగా సాయిధరమ్ తేజ్ చిత్రాన్ని కూడా పట్టాలెక్కిస్తాడట. ఎప్పటి నుంచో ఓ మాస్ కమర్షియల్ యాక్షన్ మూవీ చేయాలనుకుంటున్న సాయిధరమ్ తేజ్ కు ఈ సినిమాతో ఆ కోరిక నెరవేరబోతోంది. మరో వైపు ఓ టాప్ సీనియర్ హీరోకి కూడా సంపత్ నంది (Sampath Nandi) కథ చెప్పినట్టు సమాచారం. 

సాయిధరమ్ తేజ్ (Saidharam tej) ప్రస్తుతం సుకుమార్ శిష్యుడు దండు కార్తిక్ దర్శకత్వంలో ఓ మిస్టిక్ థ్రిల్లర్‌లో నటిస్తున్నాడు.  యాక్సిడెంట్ తర్వాత సాయిధరమ్ నటిస్తున్న సినిమా కావడం విశేషం. మొన్నీమధ్యనే సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ మూవీ జరుగుతుండగానే.. సంపత్ నంది చిత్రంలో కూడా సాయిధరమ్ తేజ్ నటిస్తాడని తెలుస్తోంది. యాక్షన్ చిత్రాలు తీయడంలో తనదైన మార్కు చూపించే సంపత్ నంది (Samath Nandi)  సాయిధరమ్ కోసం ఏ తరహా కథ రాసుకున్నాడో చూడాలి. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement