Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్రభుత్వ హాస్టల్ నుంచి 10 మంది బాలలు పరారీ..

హైదరాబాద్: సైదాబాద్ ప్రభుత్వ హాస్టల్ నుంచి పది మంది బాలల పరారీ కలకలం రేపుతోంది. సిబ్బంది వెంటపడి నలుగురిని పట్టుకున్నారు. మరో ఆరుగురి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆపరేషన్ ముస్కాన్‌లో భాగంగా వారిని రెస్క్యూ చేశారు. వారు బాలకార్మికులుగా గుర్తించి సైదాబాద్‌లోని బాలురు వసతి గృహంలో ఉంచారు. పక్కనే జువైనల్ హోం కూడా ఉంది. పది మంది బాలలు గేట్ కీపర్‌పై దాడి చేసి పరారైనట్లు సమాచారం. తప్పించుకోడానికి వాళ్లు రెండు, మూడు సార్లు ప్లాన్ చేసినట్లు తెలియవచ్చింది. వారు ఛత్తీస్‌గఢ్ ప్రాంతానికి చెందినవారు.

Advertisement
Advertisement