Abn logo
Sep 19 2020 @ 10:33AM

మాట నిలబెట్టుకున్న మెగాహీరో!

Kaakateeya

మెగా హీరో సాయితేజ్ తన మాటను నిలబెట్టుకున్నాడు. తన మంచి మనసును ఘనంగా చాటుకున్నాడు. విజయవాడలోని `అమ్మ ప్రేమ ఆదరణ సేవ` వృద్ధాశ్రమాన్ని నిర్మించాడు. అంతేకాదు ఓ సంవత్సరం పాటు దానికి అవసరమయ్యే ఖర్చులను భరించేందుకు ముందుకు వచ్చాడు. 


2019లో తన జన్మదినోత్సవం సందర్భంగా సాయితేజ్ సోషల్ మీడియా ద్వారా ఓ వీడియోను విడుదల చేశాడు. విజయవాడలోని ఓ వృద్ధాశ్రమం నిర్వాహకులు తనను సంప్రదించారని, అసంపూర్తిగా ఉన్న తమ బిల్డింగ్ నిర్మాణానికి సహాయం చేయాల్సిందిగా కోరారని తెలిపాడు. తాను దానికి అంగీకరించానని, మెగా ఫ్యాన్స్ కూడా చేతనైనంత సహాయం చేయాలని విజ్ఞప్తి చేశాడు. సాయితేజ్ పిలుపు మేరకు మెగా ఫ్యాన్స్ రూ.లక్ష సహాయం చేశారు. మాట ఇచ్చినట్టుగానే సాయితేజ్ ఆ బిల్డింగ్ నిర్మాణానికి చేయూతనందించాడు. మాట నిలుపుకున్న మెగా హీరోకు అన్నివైపుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. 

Advertisement
Advertisement
Advertisement