జీ5 ‌లో ‘రిపబ్లిక్’ చూస్తున్న సాయితేజ్.. వీడియో వైరల్

‘రిపబ్లిక్’ సినిమా విడుదలకు ముందు జరిగిన రోడ్డు ప్రమాదంలో హాస్పిటల్ పాలవడంతో.. హీరో సాయితేజ్‌కి తెలియకుండానే ఆ సినిమా రిలీజైంది. సాయితేజ్ రాలేకపోయినా.. మేనమామలు మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇద్దరూ ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొని.. మేనల్లుడికి సపోర్ట్ అందించారు. థియేటర్లలో ఈ సినిమాని మిస్ అయిన సాయితేజ్.. తాజాగా ‘జీ5’ ఓటీటీలో విడుదలైన ఈ చిత్రాన్ని చిత్రయూనిట్‌తో కలిసి చూశారు. ఆయన సినిమా చూస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


చిత్ర దర్శకుడు దేవ కట్టా, స్క్రీన్‌ప్లే రైటర్ కిరణ్, క్రియేటివ్ ప్రొడ్యూసర్ సతీష్ బీకేఎఆర్, జీ స్టూడియోస్ తెలుగు కంటెంట్ హెడ్ ప్రసాద్ నిమ్మకాయలతో కలిసి సినిమా చూసిన సాయితేజ్.. వారితో సక్సెస్‌ను కూడా సెలబ్రేట్ చేసుకున్నారు. తన సంతోషాన్ని అభిమానులతో పంచుకోవాలనుకున్న సాయితేజ్.. ఈ వీడియోని తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేసి.. అందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలిపారు. దర్శకుడు దేవ కట్టా కూడా నా తమ్ముడితో ‘రిపబ్లిక్’ నిజమైన సక్సెస్ వేడుకను జరుపుకుంటున్నాను.. అని తెలుపుతూ తేజ్‌కి కేక్ తినిపిస్తున్న ఫొటోలను షేర్ చేశారు.Advertisement