కరోనా లాక్డౌన్లో అసలు బయటికి రాని పవన్ కల్యాణ్.. ఆ గ్యాప్‌ని తన తదుపరి సినిమా కథలు వినడానికి వినియోగించారు. అందుకే వరసబెట్టి సినిమాలు ప్రకటించారు. అన్‌లాక్ ప్రకటించాక.. రీసెంట్‌గానే ఆయన 'వకీల్‌సాబ్' షూట్లో జాయిన్ అయ్యారు. 'వకీల్‌సాబ్' తర్వాత ఆయన ఏ సినిమా షూట్లో జాయిన్ అవుతారనే దానిపై క్లారిటీ లేనప్పటికీ.. రీసెంట్గా క్రిష్ బర్త్‌డే రోజు.. టీమ్ అంతా పవన్‌ని కలవడంతో.. 'వకీల్‌సాబ్' తర్వాత పవన్ ఖచ్చితంగా క్రిష్ సినిమానే చేస్తాడనేలా వార్తలు నడుస్తున్నాయి. పవన్ లుక్ కూడా ఈ సినిమా కోసం అనేలా మార్చాడు.
ఇక ఈ సినిమాలో ఇప్పటికే బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ నటిస్తుందనే విషయం తెలిసిందే. ఈ విషయం ఆమె కూడా కన్ఫర్మ్ చేసింది. మరో హీరోయిన్గా ఈ సినిమాలో నిధి అగర్వాల్ అంటూ వార్తలు నడిచాయి. కానీ తాజాగా ఈ సినిమాలో మరో హీరోయిన్గా నేచురల్ బ్యూటీ సాయిపల్లవి చేస్తుందని అంటున్నారు. అంతేకాదు.. ఈ సినిమాలో ఆమె పాత్ర ఇదంటూ కొన్ని వార్తలు కూడా సంచరిస్తున్నాయి. ఈ సినిమాలో సాయిపల్లవి జమీందారి కుటుంబ అమ్మాయిగా కనిపిస్తుందని అంటున్నారు. ఆమె పాత్ర సినిమాకి హైలెట్ అనేలా ఉంటుందని, అందుకే సాయిపల్లవి ఈ సినిమా చేయడానికి అంగీకరించిందని అంటున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు.