May 12 2021 @ 09:59AM

బాలీవుడ్ సినిమా రిజెక్ట్ చేసిన సాయి పల్లవి..?

బాలీవుడ్‌లో సినిమా అవకాశం వస్తే  సౌత్ హీరోయిన్స్ వదులుకోవాలనుకోరు. కానీ సాయి పల్లవి సున్నితంగా తిరస్కరించిందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఛత్రపతి హిందీ రీమేక్ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. వి వి వినాయక్ దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా పలువురు బాలీవుడ్ హీరోయిన్స్‌ను సంప్రదించినట్టు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటి వరకు ఎవరూ ఫైనల్ కాలేదని సమాచారం. ఈ క్రమంలో ఇటీవల ఫిదా బ్యూటీ సాయి పల్లవిని సంప్రదించారట. అయితే ప్రస్తుతం ఈమె టాలీవుడ్‌లో వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తూ బిజీగా ఉండటంతో డేట్స్ సర్దుబాటు చేయలేనని చెప్పినట్టు తెలుస్తోంది. బెల్లంకొండ శ్రీనివాస్ - వినాయక్‌లకు హిందీలో డెబ్యూ సినిమా కావడంతో అంచనాలు బాగానే ఉన్నాయి. ఇక హీరోయిన్‌గా ఎవరికి ఛాన్స్ దక్కుతుందో చూడాలి.