Abn logo
Sep 19 2020 @ 08:57AM

ప్రకృతి ఒడిలో సాయిపల్లవి!

Kaakateeya

తన నటనతోనూ, నాట్యంతోనూ భారీగా అభిమానులను సంపాదించుకున్న సాయిపల్లవి మిగతా హీరోయిన్లతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటుంది. పాత్ర తనకు నచ్చకపోతే ఎంత పెద్ద డైరెక్టర్‌కైనా `నో` చెప్పేస్తుంది. కొన్ని కోట్లు ఇస్తామన్నా వాణిజ్య ప్రకటనలలో నటించడానికి అంగీకరించదు. భారీ అభిమానగణం ఉన్నా సింపుల్‌గా ఉండడానికే ఇష్టపడుతుంది.


శేఖర్ కమ్ముల `లవ్‌స్టోరీ` షూటింగ్‌లో నాగచైతన్యతో కలిసి పాల్గొంటున్న సాయిపల్లవి తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫొటో పోస్ట్ చేసింది. ప్రకృతి ఒడిలో, చల్లటి గాలిలో సేదతీరుతున్న తన ఫొటోను పోస్ట్ చేసింది. ఈ ఫొటోపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. సాయిపల్లవి ప్రస్తుతం `లవ్‌స్టోరీ`తోపాటు `విరాటపర్వం`లోనూ నటిస్తోంది. 




Advertisement
Advertisement
Advertisement