Abn logo
Mar 6 2021 @ 19:07PM

భూమికి, మనిషికి మధ్య ఉన్న ప్రేమకథ ‘శ్రీకారం’

వెర్సటైల్ యాక్టర్ శర్వానంద్ హీరోగా 14రీల్స్ ప్లస్ పతాకంపై నూతన దర్శకుడు కిషోర్ బి. దర్శకత్వంలో.. నిర్మాతలు రామ్ ఆచంట, గోపీ ఆచంట రియలిస్టిక్ ఇన్సిడెంట్స్‌తో  నిర్మించిన చిత్రం 'శ్రీకారం'. 'నాని గ్యాంగ్‌లీడర్‌' ఫేమ్‌  ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన ప్రతీది మంచి స్పందనను రాబట్టుకుంది. రీసెంట్‌గా విడుదలైన ట్రైలర్‌ అయితే సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది. మహాశివరాత్రి సందర్బంగా మార్చి 11న ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ పార్క్ హయాత్ హోటల్‌లో చిత్ర యూనిట్ మీడియా సమావేశాన్ని నిర్వహించింది.

ఈ కార్యక్రమంలో రైటర్ సాయిమాధవ్‌ బుర్రా మాట్లాడుతూ.. ''శర్వానంద్‌గారికి మళ్ళీ మళ్లీ ఇది రాని రోజు సినిమా తర్వాత శ్రీకారం సినిమా చేశాను. రైతు బ్యాక్‌డ్రాప్‌ సినిమా ఇది. కిశోర్‌ కథ చెప్పిన వెంటనే ఈ సినిమా చేయాలి అని అనుకున్నాను. ఇలాంటి సినిమా చేయడం నా బాధ్యత. ఒక సంతోషాన్నిచ్చే సినిమా చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. భూమికి మనిషికి మధ్య ఉన్న ప్రేమకథ, తండ్రికి కొడుకుకి మధ్య ఉన్న ప్రేమకథ ఈ సినిమా. రైతును, భూమిని కమర్షియల్‌ పాయింట్‌గా చూపించాలన్న నిర్మాతలను అభినందిస్తున్నాను. కిశోర్‌ మంచి క్లారిటీ ఉన్న దర్శకుడు. తొలి సినిమాయే అయినా అనుభవం ఉన్న దర్శకుడిలా చేశాడు. శర్వానంద్‌గారి ప్రతిభ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. మంచి కథలనే ఎంచుకునే ఓ అరుదైన నటుడు శర్వానంద్‌. హిట్స్, ఫ్లాప్స్‌ ఉండొచ్చు. కానీ నటుడిగా ఆయన మాత్రం సక్సెస్‌ఫుల్‌ హీరోనే. ఈ సినిమాలో హీరో క్యారెక్టర్‌ శర్వానంద్‌కు మాత్రమే సూట్‌ అవుతుంది. ఈ భూమి మీద పైసా కూడా దోచుకోలేనిది ఒక్క రైతు మాత్రమే.." అని తెలిపారు.

Advertisement
Advertisement
Advertisement