Abn logo
Dec 3 2020 @ 00:20AM

నిర్మాతగా స్వరకర్త సాయికార్తీక్‌

సంగీత దర్శకుడు సాయికార్తీక్‌ చిత్రనిర్మాణంలోకి అడుగుపెట్టారు. ‘హ్యాపీడేస్‌’లో టైసన్‌గా, ఆ తర్వాత పలు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన రాహుల్‌, చేతన్‌ హీరోలుగా నాగం తిరుపతిరెడ్డితో కలిసి ఆయన ఓ సినిమా నిర్మిస్తున్నారు. బుధవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైందీ సినిమా. తొలి సన్నివేశానికి నాగం తిరుపతిరెడ్డి కెమెరా స్విచ్ఛాన్‌ చేయగా, సాయి కార్తీక్‌ క్లాప్‌ ఇచ్చారు. సహనిర్మాత శ్రీకాంత్‌ దీపాల గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘ఇదొక వైవిధ్యమైన సినిమా. సంగీత దర్శకుడిగా నన్ను ఆదరించారు. అలాగే, నిర్మాతగా నన్ను ఆదరించి ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నా’’ అని సాయి కార్తీక్‌ అన్నారు. ‘‘కామెడీ థ్రిల్లర్‌ చిత్రమిది’’ అని దర్శకుడు విరాట్‌ చక్రవర్తి తెలిపారు. ‘‘కథ విన్నప్పుడు థ్రిల్లయ్యా. ప్రేక్షకులూ అలాగే ఫీలవుతారు’’ అని రాహుల్‌ అన్నారు. ‘‘కన్నడలో పది చిత్రాల్లో నటించా. తెలుగులో రాహుల్‌తో కలిసి నటించడం సంతోషంగా ఉంది’’ అని చేతన్‌ అన్నారు. సాక్షీ చౌదరి, ఐశ్వర్య హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి సాయి కార్తీక్‌ సంగీత దర్శకుడు.

Advertisement
Advertisement
Advertisement