Chitrajyothy Logo
Advertisement
Published: Wed, 03 Nov 2021 21:01:12 IST

‘జీ 5’ ఓటీటీలో ‘రిపబ్లిక్’.. ఎప్పుడంటే?

twitter-iconwatsapp-iconfb-icon
జీ 5 ఓటీటీలో రిపబ్లిక్.. ఎప్పుడంటే?

హిందీలో మాత్రమే కాదు.. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ, గుజరాతీ వంటి పలు భారతీయ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వీక్షకులకు వినోదాన్ని అందిస్తోన్న ఓటీటీ వేదిక ‘జీ 5’. డైరెక్ట్-టు-డిజిటల్ రిలీజ్ చిత్రాలతో పాటు.. థియేటర్లలో విడుదల అయిన సినిమాలను సైతం వీక్షకులకు అందిస్తోన్న ‘జీ 5’.. ఇటీవల థియేటర్లలో విడుదలై మంచి విజయం సాధించిన ‘రిపబ్లిక్’ చిత్రాన్ని ప్రేక్షకులకు అందించబోతోంది. 


సాయి తేజ్ కథానాయకుడిగా దేవకట్టా దర్శకత్వంలో నిర్మాతలు జె. భగవాన్, జె. పుల్లారావు భాగస్వామ్యంతో జీ స్టూడియోస్ సంస్థ నిర్మించిన చిత్రం ‘రిపబ్లిక్’. ఐశ్వర్య రాజేష్ కథానాయికగా నటించగా.. జగపతిబాబు, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలలో నటించారు. ప్రజాస్వామ్యం అంటే ఏమిటి? ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ అధికారుల పాత్ర ఎంత ఉంటుంది? ప్రస్తుత సమాజంలో రాజకీయ నాయకుల ధోరణి ఏ విధంగా ఉంది? ప్రజలను ఏవిధంగా దోచుకుంటున్నారు? అనే కథాంశంతో ఆ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రాన్ని నవంబర్ 26న విడుదల చేయబోతున్నట్లుగా ‘జీ 5’ వర్గాలు అధికారికంగా వెల్లడించాయి. అంతకుముందు సాయి తేజ్ నటించిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రం కూడా ‘జీ 5’ ఓటీటీలోనే విడుదలైంది.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement