Jul 30 2021 @ 17:49PM

సముద్రతీరంలో హీరోయిన్ అందాల ఆరబోత

‘పేరాణ్మై’ అనే చిత్రం ద్వారా కోలీవుడ్‌లోకి అడుగుపెట్టిన సాయి ధన్షిక.. నటిగా మంచి మార్కులే పొందింది. ఆ తర్వాత ‘మాంజనా వేలు’, ‘అరవాన్‌’, ‘పరదేశి’ వంటి అనేక చిత్రాల్లో ఆమె నటించింది. అలాగే, దర్శకుడు పా.రంజిత్‌, సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘కబాలి’ చిత్రంలో హీరో కుమార్తెగానూ, ‘కబాలి’ చిత్రం తర్వాత ‘సోలో’, ‘కాలక్కూత్తు’, ‘ఇరుట్టు’, ‘సినమ్‌’ అనే చిత్రాల్లోనూ నటించింది. ప్రస్తుతం విజయ్‌ సేతుపతితో కలిసి ‘లాభం’ అనే చిత్రంలో నటించింది. అయితే, ఒక వైపు సినిమా షూటింగులతో బిజీగా ఉంటూనే మరోవైపు ప్రత్యేక ఫొటోషూట్‌లు నిర్వహించే హీరోయిన్ల సంఖ్య ఇటీవలి కాలంలో పెరిగిపోయింది. ఆ కోవలో ఈమె కూడా చేరిపోయింది. తాజాగా ఓ సముద్రతీరంలో ధనిష్క అందాలు ఆరబోస్తూ దిగిన ఫొటోలు ఇపుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.