కన్నుల పండువగా సాయిబాబా పుణ్యతిఽథి ఉత్సవాలు

ABN , First Publish Date - 2021-10-17T06:22:44+05:30 IST

కోరుట్లలోని సాయిబాబా దేవాలయంలో శనివారం పుణ్యతిథి వేడుకలు కన్ను ల పండువగా జరిగాయి.

కన్నుల పండువగా సాయిబాబా పుణ్యతిఽథి ఉత్సవాలు
పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు

- పాల్గొన్న ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు

కోరుట్ల, అక్టోబరు 16:  కోరుట్లలోని సాయిబాబా దేవాలయంలో శనివారం పుణ్యతిథి వేడుకలు కన్ను ల పండువగా జరిగాయి. దసరా మరుసటి రోజు నిర్వహించే  పుణ్యతిథి వేడుకల సందర్భంగా ఆయా ప్రాంతాలకు చెందిన జనం వేల సంఖ్యలో హాజర య్యారు. ఉదయం 5 గంటల నుంచి కాగడ హారతి, ఆలయ సంకీర్తన, అభిషేకాలు, పతకారోహణ, గణప తిపూజ, కలుషాభిషేకం, హోమంతోపాటు ప్రత్యేక పూజలను వేదపండితులు ఘనంగా నిర్వహించారు. కోరుట్ల  ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావుతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులకు వేదపండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఎమ్మెల్యే విద్యాసాగ ర్‌రావు-సరోజ, కోరుట్ల, మెట్‌పల్లి మున్సిపల్‌ చైర్మన్‌ లు అన్నం లావణ్య-అనిల్‌, సుజాత-సత్యనా రాయణ, ఎంపీపీ తోట నారాయణ, వైస్‌చైర్మన్‌ గడ్డమీది పవన్‌ బాబా దర్శనం చేసుకున్నారు. కాగా కరీం నగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, జగిత్యాల, మంచి ర్యాల తదితర జిల్లాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నిర్వాహకులు భక్తుల సౌకర్యా ర్థం అన్ని ఏర్పాట్లు చేశారు.  ఈ కార్యక్రమంలో కోరుట్ల షిరిడి సాయిబాబా భక్త సమాజం చైర్మన్‌ చిద్రాల నారాయణలతో పాటు కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ఎలాంటి అవాచంనీయ సంఘ టనలు చోటు చేసుకొకుండా కోరుట్ల సీఐ రాజశేఖర్‌ రాజ్‌ సర్కిల్‌ పరిధిలోని ఎస్‌ఐలతో బందోబస్తు నిర్వహంచారు.


Updated Date - 2021-10-17T06:22:44+05:30 IST