ఈ వారం సాహితి కార్యక్రమాలు

ABN , First Publish Date - 2020-03-09T07:10:22+05:30 IST

ధనికొండ శతజయంతి జాతీయ సదస్సు ‘తమ సోమా జ్యోతిర్గమయ’, ‘పడి లేచిన కెరటం’ నవలలు ‘మధురపద్మాలు’ బడిపిల్లల కవితలు ‘భారత కవనం’ లౌకిక రాజ్యాంగ పరిరక్షణ సమ్మేళనం విమర్శకునితో ఒక సాయంత్రం పాతూరి మాణిక్యమ్మ పురస్కారం..

ఈ వారం సాహితి కార్యక్రమాలు

ధనికొండ శతజయంతి జాతీయ సదస్సు

న్యూఢిల్లీ సాహిత్య అకాడమీ, మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు వాఖల ఆధ్వర్యంలో ధనికొండ హనుమంతరావు శతజయంతి జాతీయ సదస్సు ప్రారంభ సమావేశం మార్చి 11 ఉ.10.15ని.లకు మద్రాసు విశ్వవిద్యాల యం, చెన్నైలో జరుగుతుంది. ఎస్‌.పి. మహాలింగేశ్వర్‌, మాడభూషి సంపత్‌ కుమార్‌, కె.శివారెడ్డి, కె.శ్రీనివాస్‌ పాల్గొంటారు. తర్వాతి మూడు సమావేశాల్లో జి.వి.ఎస్‌.ఆర్‌. కృష్ణమూర్తి, ఏల్చూరి మురళీధరరావు, కేతు విశ్వనాథరెడ్డి, జగన్నాథశర్మ తదితరులు పాల్గొంటారు.

సాహిత్య అకాడెమీ, న్యూఢిల్లీ


‘తమ సోమా జ్యోతిర్గమయ’, ‘పడి లేచిన కెరటం’ నవలలు

గంటి భానుమతి ‘తమ సోమా జ్యోతిర్గమయ’, ‘పడి లేచిన కెరటం’ నవలల ఆవిష్కరణ సభ మార్చి 11 సా.6గం.లకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం, హైదరాబాద్‌లో జరుగుతుంది. 

పాలపిట్ట బుక్స్‌


‘మధురపద్మాలు’ బడిపిల్లల కవితలు

జక్కాపూర్‌ బడి పిల్లల కవితలతో వేసిన పుస్తకం ‘మధురపద్మాలు’ ఆవి ష్కరణ సభ మార్చి 12 ఉ.11.30ని.లకు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, జక్కాపూర్‌లో జరుగుతుంది. రాళ్ళబండి పద్మయ్య, బైస దేవదాస్‌, దుర్గం పర్శరాములు, మాడుగుల మురళీధరశర్మ తదితరులు పాల్గొంటారు.

జక్కాపూర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల


‘భారత కవనం’ లౌకిక రాజ్యాంగ పరిరక్షణ సమ్మేళనం

‘భారత కవనం’ లౌకిక రాజ్యాంగ పరిరక్షణ సమ్మేళనం, సదస్సు, జన కవనం కార్యక్రమం మార్చి 15 ఉ.10 నుంచి ఎం.బి.విజ్ఞాన కేంద్రం, విజయవాడలో జరుగుతుంది. కడియాల రామమోహన్‌ రాయ్‌, తెలక పల్లిరవి, కె.ఎస్‌.లక్ష్మణరావు, కె.రామచంద్రమూర్తి తదితరులు పాల్గొంటారు. 

వొర ప్రసాద్‌


విమర్శకునితో ఒక సాయంత్రం 

బెంగళూరు సాహిత్య అకాడెమీ, వరంగల్‌ సహృదయ సాహిత్య సంస్థల ఆధ్వర్యంలో మార్చి 17న సా.5గం.లకు హనుమకొండ, కిషన్‌పురలోని వాగ్దేవి డిగ్రీ్క్షపి.జి. కళాశాలలో జరిగే ‘విమర్శకునితో సాయంత్రం’ కార్య క్రమంలో కోవెల సుప్రసన్నాచార్య తన విమర్శ ప్రస్థానంపై మాట్లాడతారు. 

సాహిత్య అకాడెమీ, బెంగళూరు


పాతూరి మాణిక్యమ్మ పురస్కారం

పాతూరి మాణిక్యమ్మ సాహిత్య పురస్కారంకోసం 2019లో ప్రచురిత మైన కవితా సంపుటాలు 2ప్రతులను మార్చి 30లోగా చిరునామా: పాతూరి అన్నపూర్ణ, 1156/28-1, ప్రశాంతి నగర్‌, నవలాకులతోట, నెల్లూరు-2, ఫోన్‌: 94902 30939కు పంపాలి.

పాతూరి అన్నపూర్ణ

Updated Date - 2020-03-09T07:10:22+05:30 IST