రైతుల సంక్షేమానికి భూ రీసర్వే

ABN , First Publish Date - 2021-09-19T05:06:13+05:30 IST

ఏలేశ్వరం, సెప్టెంబరు 18: రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని భూములకు శాశ్వత భూ హక్కు రికార్డులు కల్పించేందుకు ప్రభుత్వం భూముల సమగ్ర రీసర్వేకు శ్రీకారం చుట్టిందని సహకార బ్యాంక్‌ త్రిసభ్య కమిటీ చైర్మన్‌ ఎస్‌జీవీ.సుబ్బరాజు పేర్కొన్నారు. శనివారం తహశీల్దార్‌

రైతుల సంక్షేమానికి భూ రీసర్వే

సహకార బ్యాంక్‌ త్రిసభ్య కమిటీ చైర్మన్‌ సుబ్బరాజు 

ఏలేశ్వరం, సెప్టెంబరు 18: రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని భూములకు శాశ్వత భూ హక్కు రికార్డులు కల్పించేందుకు ప్రభుత్వం భూముల సమగ్ర రీసర్వేకు శ్రీకారం చుట్టిందని సహకార బ్యాంక్‌ త్రిసభ్య కమిటీ చైర్మన్‌ ఎస్‌జీవీ.సుబ్బరాజు పేర్కొన్నారు. శనివారం తహశీల్దార్‌ ఎం.రజనీకుమారీ నేతృత్వంలో మండల పరిధిలోని లింగంపర్తిలో జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్ష పథకంలో భాగంగా సుబ్బరాజు, నాయకులు, రెవెన్యూ అధికారులు, సర్వేయర్లు, రైతుల సమక్షంలో తొలిసారిగా రీసర్వే ప్రారంభించారు. 100ఏళ్ల తరువాత అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో చేపట్టే ఈ సమగ్ర రీసర్వే ద్వారా ఏళ్ల తరబడిగా ఉన్న భూ సరిహద్దు, గ్రా మ కంఠాల సమస్యలు పరిష్కరించడం, రైతులకు సంబంధించిన భూముల వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయోజనం ఏర్పడుతుందని సుబ్బారావు తెలిపారు. వీఆర్వోలు కొట్టేటి సత్యారావు, బాలరాజు, నాగేశ్వరరావు, మ ండల సర్వేయర్‌ సుబ్రహ్మణ్యం, ఉపసర్పంచ్‌ గొంతిరెడ్డి సూరిబాబు, చిక్కాల లక్ష్మణరావు, యార్లగడ్డ రాజాచౌదరి, అడపా పార్ధసారధి పాల్గొన్నారు.

Updated Date - 2021-09-19T05:06:13+05:30 IST