సాగు.. సందడి

ABN , First Publish Date - 2021-06-15T05:42:27+05:30 IST

సాగు.. సందడి

సాగు.. సందడి
కేసముద్రం మండలం కల్వల శివారులో పసుపు పంట కోసం విత్తనాలు వేస్తున్న రైతులు

తొలకరి ప్రారంభంతో పల్లెల్లో విత్తన శోభ

ఊపందుకున్న వ్యవసాయ పనులు 

హుషారుగా రైతులు 

జోరందుకున్న విత్తనప్రక్రియ  

భారీ వర్షాలు కురిసే వరకు ఆగాలంటున్న శాస్త్రవేత్తలు


మహబూబాబాద్‌ అగ్రికల్చర్‌ :  వ్యవసాయ పనులతో పల్లెల్లో పండుగ వాతావర ణం నెలకొంది. నైరుతి రుతుపవనాలతో జిల్లాలో ఓ మోస్తారు తొలకరి వర్షాలు ప్రారంభం కాగా జోరుగా విత్తనాలు వేసే ప్రక్రియ ఆరంభ మైంది. పల్లెల్లో రైతులు హుషారుగా వ్యవసాయ పనుల్లో ని మగ్నమయ్యారు. కాని మరో రెండు, మూ డుసార్లు భారీ వర్షాలు కురిస్తేనే విత్త నాలు వేసుకోవాలని, భూమిలో వేడి తగ్గే వరకు ఆగాలని రైతులకు వ్యవ సాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. 


జిల్లాలో అధికంగానే వర్షపాతం..

జిల్లాలో ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలతో రైతులు విత్తనాల కోసం పరుగెడుతున్నారు. ఈ సారి తొలకరికి ముందే తుఫాన్‌లు రావ డంతో ఒకటి, రెండు భారీ వర్షాలు కురిశాయి. వాస్తవానికి ప్రతీ గ్రామం లో 60 మిల్లీమీటర్ల వర్షం కురిస్తే విత్తనాలు వేయాల్సి ఉంటుందని మల్యాల శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఈ నెల 1 నుంచి 12వ తేదీ వరకు జిల్లాలో 42.0 మిల్లిమీటర్ల సాధారణ వర్షపాతం పడాల్సి ఉన్నా ఇప్పటివరకు 109.1 మిల్లిమీటర్ల ఇంటిగ్రేటేడ్‌ వర్షపాతం పడింది. దాదాపు 160.0 అధిక వర్షపాతం నమోదైంది. అన్ని మండలాల్లో 60 మిల్లీమీటర్ల నుంచి 175.3 మిల్లిమీటర్ల వరకు వర్షపాతం కురిసింది. ఇంటిగ్రేటేడ్‌ వర్షపాతం గమనిస్తే 100 మిల్లిమీటర్ల నుంచి 175.3 మిల్లిమీటర్ల వర్షపాతానికి పైగా గూడూరు, మహబూ బాబాద్‌, కురవి, కేసముద్రం, డోర్నకల్‌, నర్సింహులపేట, మరిపెడ, దంతాలపల్లి, తొర్రూరు మండలాల్లో నమో దైంది. కొత్తగూడ, గంగారం, బయ్యారం, గార్ల, చిన్నగూ డూరు మండలాల్లో 100 మిల్లిమీటర్లలోపు వర్షపాతం నమోదైంది. ఒక పెద్దవంగర మండలంలో మాత్రం కేవ లం 49.4 మిల్లిమీటర్ల అతి తక్కువ వర్షం కురిసింది. 


వ్యవసాయ పనుల్లో రైతులు బిజీ.. 

ఈ సారి నైరుతి రుతుపవనాలు సకాలంలో వచ్చా యి. తొలకరికి ముందే తుఫాన్‌ కారణంగా జిల్లాలో భారీ వర్షాలు కురవడంతో భూమి చల్లబడింది. ఆశించిన రీతిలో వర్షాలు పడుతుండడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. దాంతో వ్యవసాయ పనుల్లో రైతులు బిజీ..బిజీగా మారిపోయారు. నిన్న, మొన్నటి వరకు రైతులు ధాన్యం అమ్ముకోవడానికి కొనుగోలు కేం ద్రాల్లో రోజుల తరబడి ఉండి, వర్షాలతో తడిసిన ధాన్యం బస్తాలను ఎండబెట్టుకునేందుకు, మిల్లులకు తరలించేందుకు నానా తంటాలు పడ్డ పడ్డారు. సకాలం లో వచ్చిన నైరుతి వర్షాలు రైతులకు కొంత ఊరట ని చ్చింది.  దుక్కులు దున్నుకోవడం, పొలాల్లో సేంద్రియ ఎరువు (పెంట) పోసుకోవడం, వ్యవసాయ భూముల్లో రేగడి మట్టి వేసుకోవడం, పత్తి, మిర్చి, పసుపుతో పాటు ఇతర విత్తనాలు వేసుకోవడంలో రైతులు నిమగ్నమ య్యారు. 2020–21లో ఖరీఫ్‌ సీజన్‌ లో 4,35,330 ఎకరాల్లో వివిధ పం టలు సాగు చేస్తున్నారు. ప్రధానం గా పత్తి, మిర్చి, వరి పంటలు ఎ క్కువ విస్తీర్ణంలో వేశారు. ఈసారి మిర్చికి డిమాండ్‌ ఉండడంతో మిర్చి పంటను అధికంగా సాగు చేస్తున్నారు. 


60 మిల్లీమీటర్ల వర్షం పడే వరకు ఆగాలి : ఎన్‌.కిశోర్‌కుమార్‌, విస్తీర్ణశాస్త్రవేత్త, కేవీకే మల్యాల..

భూమిలో ఇంకా వేడి తగ్గిపోలేదు. వర్షాలు అంతంతమాత్రంగానే కురిశాయి. 60 మిల్లిమీటర్ల స్థాయిలో మరో రెండు, మూడు వర్షాలు పడేంతవరకు విత్తనాలు విత్తుకోవద్దు. వర్షాలు పడకుండా ఎండలు కాస్తే విత్తనాలు మాడిపో యే ప్రమాదం ఉంది. భూమిలో తేమ ఉన్నప్పుడు మాత్రమే విత్తనాలను విత్తుకోవాలి.  

Updated Date - 2021-06-15T05:42:27+05:30 IST