నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి

ABN , First Publish Date - 2021-02-26T04:16:10+05:30 IST

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 3 వ్యవసాయ చ ట్టాలను రద్దు చేయాలని ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో గురువారం డిప్యూటీ తహసీల్దార్‌ గోపీకృష్ణకు వినతిపత్రం ఇచ్చారు.

నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి
గిద్దలూరులో వినతిపత్రం అందజేస్తున్న నాయకులు


మార్కాపురం (వన్‌టౌన్‌) ఫిబ్రవరి 25: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 3 వ్యవసాయ చ ట్టాలను రద్దు చేయాలని ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో గురువారం డిప్యూటీ తహసీల్దార్‌ గోపీకృష్ణకు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా రైతు సంఘం పశ్చిమ ప్రకాశం జిల్లా కార్యదర్శి గాలి వెంకటరామిరెడ్డి మా ట్లాడుతు కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ల ప్రయోజనాలే లక్ష్యంగా వ్యవసాయ చట్టాలను తె చ్చిందన్నారు. వాటిని రద్దు చేయాలని రైతు లు 97 రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నా  కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుందన్నారు. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులు అమలు చేయాలన్నారు. వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించేలా నూ తన వ్యవసాయ చట్టాలను మార్చాలన్నారు.  కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యాక్షుడు డి.సోమయ్య, సీ ఐటీయూ జిల్లా అధ్యక్షుడు డీకేఎం రఫి, ఎంపీజే రాష్ట్ర కో శాధికారి ఎస్‌ఏ రజాక్‌ ఉ న్నారు.

కంభంలో..

కంభం : 6 నెలల క్రితం కేంద్రం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చే యాలంటూ రైతు సంఘాల నాయకులు గు రువారం సీనియర్‌ అసిస్టెంట్‌కు వినతిపత్రం అందచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఢిల్లీలో జరుగుతున్న ఉద్యమంలో సుమారు 70 మం ది రైతులు అమ రులయ్యారన్నారు. దేశప్రజల ఆహార భద్రతకు ముప్పు తెచ్చే ఈ 3 చట్టాలను ర ద్దు చేయాలని ఆ వినతిపత్రంలో కోరారు.  కార్యక్రమంలో పశ్చిమ ప్రకాశం జిల్లా సహాయ కార్యదర్శి దాసరిరెడ్డి, కంభం మండల కార్యదర్శి కొప్పుల సత్యనారాయణరెడ్డి, విము క్తి చిరుతలకక్షి జిల్లా కార్యదర్శి సతీ్‌షకుమా ర్‌, కన్వీనర్‌ వెంకటశేఖర్‌, రైతు సంఘ నాయకులు కిరణ్‌కుమార్‌ పాల్గొన్నారు.


Updated Date - 2021-02-26T04:16:10+05:30 IST