Abn logo

సాగో పొంగల్‌ ఘీ రోస్ట్‌ పనీర్‌

కావాల్సిన పదార్థాలు: పనీర్‌ - 100 గ్రా, నెయ్యి-20 మి.లీ, గుంటూరు కారం పొడి-20 గ్రా, ధనియాలు- 30 గ్రా, నల్ల మిరియాలు- 2గ్రా, జీరా - 1 గ్రా, కరివేపాకు- 5 గ్రా, నిమ్మ-1, పచ్చిమిర్చి-5, సగ్గుబియ్యం- 40 గ్రా, పెసరపప్పు- 40 గ్రా, పసుపు-2గ్రా, అల్లం- 5 గ్రా, ఉప్పు- 10 గ్రా, నల్లమిరియాల పొడి- 3గ్రా, కొత్తిమీర- 5 గ్రా, సగ్గుబియ్యం- 3గ్రా, ఆయిల్‌ - 12 మి.లీ.


తయారీ విధానం: ముందుగా సగ్గుబియ్యంను వేడి నీటిలో వేసి నానబెట్టాలి. తరువాత ఓ గిన్నెలో ధనియాలు, జీలకర్ర, బ్లాక్‌ పెప్పర్‌ కార్న్‌ను ముందుగా డ్రై రోస్ట్‌ చేయాలి.  ఇప్పుడు నానబెట్టిన పచ్చిమిర్చి, రోస్టెడ్‌ స్పైసెస్‌ను మెత్తగా పేస్ట్‌లా చేసుకోవాలి.  ఇప్పుడు నెయ్యిలో ఈ పేస్ట్‌ను ఫ్రై చేయాలి. పనీర్‌ క్యూబ్స్‌, ఉప్పు వేసి నెయ్యిలో ఫ్రై చేయాలి.


సాగో పొంగల్‌

రెండు గంటల పాటు సగ్గు బియ్యం నాన  బెట్టాలి.  ఈ నీటిని వడగట్టి పక్కన పెట్టుకోవాలి.  ఓ గిన్నెలో ఆయిల్‌ వేసి ఆవాలు, జీలకర్ర, నల్లమిరియాలు వేసి వేగించడంతో పాటుగా అల్లం, పచ్చిమిర్చి, పసుపు  వేసి కలియతిప్పి, దీనిలో పెసరపప్పు, సగ్గు బియ్యం, తగినంత నీరు కలపాలి. సన్నటి మంటపై ఉడకనిచ్చి నెయ్యి, కొత్తిమీర ఆకులు వేయాలి. ఈ సాగో పొంగల్‌ పై పనీర్‌ ఘీ రోస్ట్‌ వేసి సర్వ్‌ చేసుకోవాలి.


సూర్య

హెడ్‌ చెఫ్‌, ఫర్జీ కేఫ్‌, హైదరాబాద్‌

మేథీ బాజీకరివేపాకు చట్నీకరివేపాకు కర్రీచోలే రాజ్మా కర్రీసోయా బీన్‌ ఆలూ కూర్మాకీటో బటర్‌ పనీర్‌ మునగకాయ థోరన్‌cauliflower కర్రీపనీర్‌ కోఫ్తే కా సలాన్‌షాహీ పనీర్‌
Advertisement