సగ్గుబియ్యం వడియాలు

ABN , First Publish Date - 2021-05-28T14:42:34+05:30 IST

సగ్గుబియ్యం- ఓ కప్పు, నీళ్లు- ఆరు కప్పులు, పచ్చి మిర్చి- 5, జీలకర్ర- రెండు స్పూన్లు, ఉప్పు తగినంత, అల్లం- కాస్త.

సగ్గుబియ్యం వడియాలు

కావలసిన పదార్థాలు: సగ్గుబియ్యం- ఓ కప్పు, నీళ్లు- ఆరు కప్పులు, పచ్చి మిర్చి- 5, జీలకర్ర- రెండు స్పూన్లు, ఉప్పు తగినంత, అల్లం- కాస్త.


తయారుచేసే విధానం: సగ్గుబియ్యం బాగా కడిగి పదినిమిషాలు నానబెట్టాలి, నానిన సగ్గుబియ్యం, ఆరు కప్పుల నీళ్లు వేసి ప్రెషర్‌ కుక్కర్‌లో మూడు విజిల్స్‌ వచ్చేవరకు ఉడికించాలి. జీలకర్ర, అల్లం, ఉప్పు, పచ్చిమిర్చి గ్రైండర్‌లో మెత్తగా రుబ్బాలి. ఉడికించిన సగ్గుబియ్యానికి ఉప్పు, అల్లం మిశ్రమం వేసి బాగా కలపాలి. తడి గుడ్డపై స్పూన్‌తో చిన్న చిన్న వడియాలు వేసి మంచి ఎండలో ఆరబెట్టాలి. బాగా ఆరిన వడియాల్ని ఓ డబ్బాలో వేసి జాగ్రత్త చేస్తే సరి.

Updated Date - 2021-05-28T14:42:34+05:30 IST