సాగర్‌మాత మహోత్సవాలు ప్రారంభం

ABN , First Publish Date - 2021-03-08T05:42:29+05:30 IST

దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని గుంటూరు మేత్రాసనం రజిత జూబ్లీ గురువులు పిల్లి ఆంతోని అన్నారు.

సాగర్‌మాత మహోత్సవాలు ప్రారంభం
ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్న విచారణ గురువులు

విజయపురిసౌత్‌, మార్చి 7: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని గుంటూరు మేత్రాసనం రజిత జూబ్లీ గురువులు పిల్లి ఆంతోని అన్నారు. సాగరమాత తిరునాళ్ల మహోత్సవాల్లో భాగంగా మొదటిరోజైన ఆదివారం ఆలయంలో ఆయన దివ్య బలిపూజ నిర్వహించారు. భక్తులకు దేవుని సందేశమందించారు. దైవరాజ్యంలో మనందరి కోసం మరియమాత ప్రత్యేక ప్రార్థనలు  చేసినట్లు  చెప్పారు. ఉదయం చిన్నాబత్తిని హృదయ్‌కుమార్‌, అల్లం సాగర్‌మనోజ్‌లు దివ్య బలిపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. మల్లవరపు సుందరబాబు భక్తులకు జపమాల, స్తుతి ఆరాధన, వాక్య పరిచర్య, స్వస్థత ప్రార్థనలు, ఆహ్వాన కార్యక్రమాలు జరిపారు. మధ్యాహ్నం నుంచి అన్నదానం నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి ప్రార్థనలో పాల్గొన్నారు. 


Updated Date - 2021-03-08T05:42:29+05:30 IST