Jul 23 2021 @ 18:45PM

Sagarika: చీకటి వ్యాపారం బయటపడింది

బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌ కుంద్రాపై ఆరోపణలు చేసిన హీరోయిన్‌ సాగరిక కష్టాల్లో పడ్డారు. తనను అత్యాచారం చేసి, చంపేస్తామంటూ బెదిరింపులతో ఫోన్లు వస్తున్నాయని తెలిపింది. శుక్రవారం ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలిపింది. ‘‘కొందరు వ్యక్తులు నాకు  ఫోన్‌ చేసి అసభ్యంగా మాట్లాడుతున్నారు. అత్యాచారం చేసి చంపుతామంటూ బెదిరింపులకు దిగుతున్నారు.  రాజ్‌ కుంద్రా ఏం తప్పు చేశాడని ప్రశ్నిస్తున్నారు. మీరు పోర్న్‌ చిత్రాలను చూస్తారు కాబట్టే మేము వాటిని చిత్రీకరిస్తున్నామని వారు వాదనకు దిగారు. ఈ చీకటి వ్యాపారం బయట పడడానికి కారణం నేనేనని నిందిస్తున్నారు. ఇప్పటికీ వేర్వేర్లు నంబర్ల నుంచి ఫోనులు చేసి హింసిస్తున్నారు. ఇదంతా చాలా ఇబ్బందిగా ఉంది. నా జీవితం ప్రమాదంలో పడినట్లు అనిపిస్తోంది. దీనికి కారణమైనవారిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలనుకుంటున్నా’’ అని సాగరిక చెప్పుకొచ్చారు.


మరో పక్క రాజ్‌ కుంద్రాను విచారిస్తున్న పోలీసులకు ఆశ్చర్యకర విషయాల  తెలుస్తున్నాయి. ఆయన కాల్స్‌, వాట్సాప్‌ డేటా ఆధారంగా కీలక వివరాలను ముంబై పోలీసులు సేకరించారు. అందులో ఒక వాట్సప్ ఛాట్ చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. 122 పోర్న్‌ వీడియోలకు సంబంధించిన అతి పెద్ద డీల్‌ను రాజ్‌కుంద్రా చేశారని శనివారం పోలీసులు కోర్టుకు వివరించారు. ఈ వీడియోల విక్రయానికి గానూ రూ.9కోట్లు  ఒప్పందం చేసుకున్నారని తెలిసింది.  ఈ డీల్‌ అంతర్జాతీయ స్థాయిలో ఉందని పోలీసులు పేర్కొన్నారు. 


Bollywoodమరిన్ని...