సాగర్‌ 4 గేట్ల ద్వారా విడుదలవుతున్న నీరు

ABN , First Publish Date - 2021-10-20T07:02:34+05:30 IST

సాగర్‌ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద రాక కొనసాగుతుండటంతో నాలుగుగేట్ల ద్వారా ప్రాజెక్ట్‌ అధికారులు నీటిని విడుదలచేస్తున్నారు. సాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు (312.0450టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 589.80 అడుగులు (311. 4474టీఎంసీలు)గా ఉంది.

సాగర్‌ 4 గేట్ల ద్వారా విడుదలవుతున్న నీరు
సాగర్‌ నాలుగు గేట్ల ద్వారా నీటి విడుదల

నాగార్జునసాగర్‌, అక్ట్టోబరు19: సాగర్‌ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద రాక కొనసాగుతుండటంతో నాలుగుగేట్ల ద్వారా ప్రాజెక్ట్‌ అధికారులు నీటిని విడుదలచేస్తున్నారు. సాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు (312.0450టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 589.80 అడుగులు (311. 4474టీఎంసీలు)గా ఉంది. సాగర్‌ నుంచి కుడి కాల్వకు 9633క్యూసెక్కులు, ఎడమకాల్వకు 7436 క్యూసెక్కులు, ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రం నుంచి 33982 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీకి 1800క్యూసెక్కులు, నాలుగు క్రస్ట్‌ గేట్లను ఐదు అడుగుల మేరకు ఎత్తి 32316క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. .సాగర్‌ నుంచి మొత్తం 85167 క్యూసెక్కుల నీరు విడుదలవుతుండగా, శ్రీశైలం నుంచి 65958 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది.

మూసీకి కొనసాగుతున్న ఇన్‌ఫ్లో

కేతేపల్లి:మూసీ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో నిలకడగా ఉంది.ఇన్‌ఫ్లో మంగళవారం సాయంత్రానికి 4,883 క్యూసెక్కులుగా నమోదైంది. 645అడుగులు(4.46టీఎంసీలు) పూర్తిస్థాయి సామర్థ్యమున్న ప్రాజెక్టులో ప్రస్తుతం 643.30అడుగుల(4.02టీఎంసీలు) నీటిమట్టం ఉంది. ఇన్‌ఫ్లో వస్తుండటంతో అధికారులు 3, 11 నెంబరు క్రస్ట్‌గేట్లను రెండు అడుగులమేర ఎత్తి దిగువకు 5,082క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

పులిచింతలకు కొనసాగుతున్న వరద

చింతలపాలెం: చింతలపాలెం మండలంలోని పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి మంగళవారం కూడా వరద కొనసాగింది. దీంతో ప్రాజెక్టులోని ఐదు క్రస్ట్‌ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి 67811క్యూసెక్కుల నీరు వస్తుండగా, ఐదు క్రస్ట్‌ గేట్లను ఒక మీటరు మేర ఎత్తి 51369 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదలచేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 175అడుగులు (45.77టీఎంసీలు)కాగా, ప్రస్తుతం 168.01అడుగులు(35.59టీఎంసీలు)గా నమోదైంది.

Updated Date - 2021-10-20T07:02:34+05:30 IST