20 క్రస్ట్‌గేట్ల ద్వారా నీటి విడుదల

ABN , First Publish Date - 2022-10-05T06:07:13+05:30 IST

నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌కు భారీ వరద నీరు వచ్చి చేరుతుండడంతో అధికారులు 20 క్రస్ట్‌గేట్ల ద్వారా నీటి విడుదల చేస్తున్నారు.

20 క్రస్ట్‌గేట్ల ద్వారా నీటి విడుదల
క్రస్ట్‌గేట్ల ద్వారా విడుదలవుతున్న నీరు

విజయపురిసౌత్‌, అక్టోబరు 3: నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌కు భారీ వరద నీరు వచ్చి చేరుతుండడంతో అధికారులు 20 క్రస్ట్‌గేట్ల ద్వారా నీటి విడుదల చేస్తున్నారు. మంగళవారం ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు చేరుకుంది. ఇది 312.04 టీఎంసీలకు సమానం. ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 2,400 క్యూసెక్కులు, కుడికాలువ ద్వారా 8,452, ఎడమ కాలువ ద్వారా 6,401, ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రం ద్వారా 32,886, 20 క్రస్ట్‌గేట్లలో రెండు గేట్లను పది అడుగులు, 18 గేట్లను ఐదు అడుగుల మేర 1,75,826 క్యూసెక్కులు, వరద కాలువ ద్వారా 400, మొత్తం  2,26,365 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి 2,26,365 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం నీటిమట్టం 884.80 అడుగులుంది. ఇది 214.84 టీఎంసీలకు సమానం. 

Updated Date - 2022-10-05T06:07:13+05:30 IST