Abn logo
Sep 21 2021 @ 00:43AM

4 క్రస్ట్‌గేట్ల ద్వారా నీటి విడుదల

క్రస్ట్‌గేట్ల ద్వారా విడుదలవుతున్న నీరు

విజయపురిసౌత, సెప్టెంబరు 20: నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌ 4 క్రస్ట్‌గేట్ల ను సోమవారం పది అడుగుల మేర ఎత్తి 32,400 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. సాగర్‌ ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు చేరింది. ఇది 312.04 టీఎంసీలకు సమానం. కుడి కాలువ ద్వారా 88,831 క్యూసెక్కులు, ఎడమకాలువ ద్వారా 8,718, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 2,400, ఎల్‌ఎల్‌సీ ద్వారా 150, ప్రధాన జల విద్యుత కేంద్రం ద్వారా 25,659, మొత్తంగా 78,158 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి 78,158 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం నీటిమట్టం 884.60 అడుగులు ఉంది. ఇది 213.40 టీఎంసీలకు సమానం. జూరాల నుంచి 25,007 క్యూసెక్కులు, రోజా నుంచి 8,622 క్యూసెక్కులు, మొత్తంగా 33,629 క్యూసెక్కుల నీరు శ్రీశైలానికి వచ్చి చేరుతోంది.