ఆంధ్రజ్యోతి(17-08-2021)
గర్భిణిగా ఉన్న సమయంలో ఇన్‌ఫెక్షన్లు, అలర్జీలు సహజం. ఇలాంటి సీజనల్ అలర్జీలు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు, ఛాతీ బిగదీయడం లాంటి సీజనల్ సమస్యలను తగ్గించడంలో కుంకుమ పువ్వు మెరుగైనది. క్రాకస్ సెటైవస్ అనే సాంకేతిక నామం కలిగిన కుంకుమ పువ్వును ఎన్నో ఆయుర్వేద ఔషధాల తయారీలో ఉపయోగిస్తూ ఉంటారు. దీనికి ఉండే భిన్నమైన ఆరోగ్య ప్రయోజనాలను బట్టి గర్భం దాల్చింది మొదలు తొమ్మిదో నెల వరకూ కుంకుమ పువ్వును తీసుకోవచ్చని వైద్యులు సూచిస్తూ ఉంటారు. అలాగే అది మొదటి ప్రెగ్నెన్సీ అయినా మూడవ ప్రెగ్నెన్సీ అయినా కుంకుమ పువ్వును నిరభ్యంతరంగా ఆహారంలో వాడుకోవచ్చని కూడా ఆయుర్వేద వైద్యులు అంటున్నారు.