బీహార్ మసీదుపై Saffron Flag...కాషాయధారుల హర్షధ్వానాలు
ABN , First Publish Date - 2022-04-12T13:10:57+05:30 IST
రామనవమి నాడు బీహార్ రాష్ట్రంలోని ముజఫర్‌పూర్ పట్టణంలోని ఓ మసీదుపై కాషాయ జెండా కట్టిన ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది....
పాట్నా(బీహార్): రామనవమి నాడు బీహార్ రాష్ట్రంలోని ముజఫర్‌పూర్ పట్టణంలోని ఓ మసీదుపై కాషాయ జెండా కట్టిన ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.రామ నవమి సందర్భంగా బీహార్ మసీదుపై కాషాయ జెండా పెట్టాక పలువురు కాషాయధారులు హర్షధ్వానాలు చేయడం వీడియోలో కనిపించింది.రామనవమిని పురస్కరించుకుని కొందరు కార్యకర్తలు మసీదు ముందు ఊరేగింపు జరిపారు.ముజఫర్‌పూర్‌లో ఓ వ్యక్తి మసీదు గోడ ఎక్కి, దాని గేటు పైన కాషాయ జెండాను కట్టాడు. కత్తులు, హాకీ స్టిక్‌లు చేతబట్టి బైక్‌లపై వచ్చిన కాషాయధారులు మసీదుపై జెండా పెడుతున్న యువకుడిని నినాదాలతో ఉత్సాహపరిచారు.రామ నవమిని పురస్కరించుకుని మహ్మద్‌పూర్ గ్రామంలోని డాక్ బంగ్లా మసీదు ముందు యువకులు ఊరేగింపు జరిపారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ముజఫర్‌పూర్ ఎస్ఎస్పీ జయంత్ కాంత్ చెప్పారు. అయితే ఈ కేసులో ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని ఎఎస్పీ చెప్పారు.ఈ ఘటన జరిగినప్పటి నుంచి ఎలాంటి మత కలహాలు జరగలేవని పోలీసులు వివరించారు.