HYD : ఈత.. కారాదు కడుపుకోత.. ఈ జాగ్రత్తలు పాటిస్తే సేఫ్..

ABN , First Publish Date - 2022-03-18T15:11:40+05:30 IST

‘అమ్మా.. దుకాణం వరకు వెళ్లి పది నిమిషాల్లో వస్తా’ ఇది జవహర్‌నగర్‌ పరిధిలో గబ్బిలాలపేట చెరువు కుంట ఘటనలో

HYD : ఈత.. కారాదు కడుపుకోత.. ఈ జాగ్రత్తలు పాటిస్తే సేఫ్..

  • ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయాలి

హైదరాబాద్‌ సిటీ : ‘అమ్మా.. దుకాణం వరకు వెళ్లి పది నిమిషాల్లో వస్తా’ ఇది జవహర్‌నగర్‌ పరిధిలో గబ్బిలాలపేట చెరువు కుంట ఘటనలో మరణించిన ముగ్గురిలో ఒకరైన నవీన్‌కుమార్‌ తల్లితో చెప్పిన మాట. ముగ్గురు స్నేహితులు చెరువు వద్దకు వెళ్లి ఈత రాకున్నా.. నీళ్లలోకి దిగి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈత సరదా నూరేళ్ల జీవితాన్ని నీట ముంచుతోంది. కన్నవారికి కడుపుకోతను మిగులుస్తోంది. ముఖ్యంగా వేసవిలో ఈతకు వెళ్లి నీట మునిగి చనిపోతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఏడాదిలో రంగారెడ్డి జిల్లా పరిధిలో 64 మంది నీట మునిగి చనిపోయారు.  చెరువులు, నీటి కుంటలు, నీరు చేరిన క్వారీగుంతల వద్ద ఎలాం టి రక్షణ చర్యలు లేకపోవడంతో ఈతకు వచ్చి తల్లిదండ్రులకు శోకా న్ని మిగుల్చుతున్నారు. ఇలాంటి ప్రాంతా ల్లో ఫెన్సింగ్‌ ఏర్పాటు చేసి, ఎవరినీ నీటిలో దిగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని నిపుణులు చెబుతున్నారు.


స్మిమ్మింగ్‌ పూల్‌లో జాగ్రత్తలు :-

- స్విమ్మింగ్‌ పూల్‌లో నిపుణులైన ట్రై నర్లను ఎప్పుడూ అందుబాటులో ఉంచాలి

- డయేరియా, వాంతులతో బాధపడుతున్న వారు పూల్‌లో దిగకుండా ఉంటే మంచిది

- గాయాలు, పుండ్లతో బాధపడుతున్నవారు నీటిలో ఈదులాడరాదు

- ఫూల్‌లో సేఫ్టీ రోప్‌, సేఫ్టీ రింగ్‌ ఎప్పుడూ అందుబాటులో ఉంచాలి

- చిన్నారులను స్విమ్మింగ్‌ పూల్‌కు సమీపంలో ఒంటరిగా వదలకూడదు.

- పెద్దలు, ట్రయినర్ల ఆధ్వర్యంలోనే ఈత నేర్చుకోవాలి 


లైఫ్‌గార్డ్‌ లేకుండా ఈత వద్దు :-

ప్రైవేటు వ్యక్తులు లేదా ప్రభుత్వం నిర్వహించే స్విమ్మింగ్‌పూల్‌ ఏదైనా తప్పనిసరిగా లైఫ్‌గార్డ్‌లు ఉండాల్సిందే. ఈతరాని వారికి లైఫ్‌గార్డ్‌లు, ట్యూబ్‌లు, బెలూన్ల సాయంతోనే స్విమ్మింగ్‌పూల్‌లోకి అనుమతించాలి. ప్రతి స్విమ్మింగ్‌ పూల్‌ వద్ద సేఫ్టీ ఏర్పాట్లు ఉన్నాయా లేదా చెక్‌ చేసుకున్న తర్వాతనే ఈత నేర్చుకోడానికి వెళ్లాలి. ఎస్‌. హర్జిందర్‌సింగ్‌, జీహెచ్‌ఎంసీ లైఫ్‌గార్డ్‌ ట్రైనర్‌, గజ ఈతగాడు.


ఒంటరిగా వద్దు

ఈతకు ఎట్టి పరిస్థితుల్లో ఒంటరిగా వెళ్లకూడదు. ఆ సమయంలో ఏదైనా ప్రమాదం జరిగితే గమనించి కాపాడేందుకు ఎవరో ఒకరి సాయం తప్పనిసరి. 

- స్కూల్‌ నుంచి పిల్లలు ఎక్కడికి వెళుతున్నారన్న విషయంపై తల్లిదండ్రులు పెద్దలు గమనిస్తూ ఉండాలి.

- ఈత వచ్చిన వారి సమక్షంలో పిల్లలకు ఈత నేర్పించాలి.

- చెరువులో, నీటి కుంటల లోతు తెలియకుండా దిగవద్దు. డైవ్‌ చేయకూడదు.   

- ఈత నేర్చుకునేవారు తప్పనిసరిగా లైఫ్‌ జాకెట్లను ధరించాలి

- అలసట వచ్చేంతవరకు ఎక్కువ దూరం ఈత కొట్టరాదు.

Updated Date - 2022-03-18T15:11:40+05:30 IST