పరిశ్రమల్లో రక్షణ, భద్రత ప్రమాణాలపై తనిఖీలు

ABN , First Publish Date - 2020-08-11T09:18:24+05:30 IST

పరిశ్రమల్లో రక్షణ, భద్రత ప్రమాణాలపై తనిఖీలు

పరిశ్రమల్లో రక్షణ, భద్రత ప్రమాణాలపై తనిఖీలు

హైదరాబాద్‌, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పరిశ్రమలు, కర్మాగారాలు ఇతర పారిశ్రామిక ఉత్పత్తుల కేంద్రాల్లో రక్షణ, కార్మికుల భద్రత ప్రమాణాలను వారం రోజుల్లో పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అధికారులను ఆదేశించారు. నిబంధనలు పాటించని యూనిట్లపై కఠినంగా వ్యవహరించాలని ఆయన పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్‌ రంజన్‌కు సూచించారు. దీంతో పీసీబీ, కార్మిక సంక్షేమ శాఖ అధికారులు నిపుణులతో కూడిన ప్రత్యేక బృందాలను ఖరారు చేశారు. మంగళవారం నుంచి పరిశ్రమల్లో తనిఖీలు చేపట్టాలని నిర్ణయించారు. తాజాగా విజయవాడలో జరిగిన అగ్ని ప్రమాద సంఘటనతో అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామికవాడల్లోని పరిశ్రమల్లో భద్రత ప్రమాణాలు, కార్మికుల రక్షణ తదితర అంశాలపై తనిఖీలు చేపట్టాలని నిర్ణయించింది.  

Updated Date - 2020-08-11T09:18:24+05:30 IST